Breaking News

కమల్ హాసన్‌ థగ్‌ లైఫ్‌లో మీర్జాపూర్‌ నటుడు.. క్లారిటీ ఇదే!

Published on Tue, 06/03/2025 - 15:55

కోలీవుడ్ స్టార్‌ కమల్‌ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్‌ లైఫ్‌. ఈ మూవీకి మణిరత్న దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు జతకట్టారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

అయితే ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్‌ త్రిపాఠి నటించారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన పంకజ్‌.. ఈ వార్తలపై స్పందించారు. కమల్ హాసన్ మూవీ థగ్‌ లైఫ్‌లో తాను నటించలేదని అన్నారు. ఆ కథనాల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదంతా సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ మాత్రమేనని తెలిపారు.

గతంలో తాను దక్షిణాది భాషల్లో నటించడంపై పంకజ్‌ మాట్లాడారు. అక్కడ నటించాలంటే తనకు భాష ప్రధాన సమస్య అని తెలిపారు. తెలియని భాషలో నటించాలంటే అసౌకర్యంగా ఉంటుందని.. హిందీ అయితే తనకు కంఫర్ట్‌గా ఉంటుందన్నారు. ఒకసారి తెలుగు సినిమాలో చేయడానికి వెళ్లినప్పుడు ఏబీసీడీల దగ్గర నుంచి చెప్పాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో తనకు అసౌకర్యంగా అనిపించిందని వెల్లడించారు. నా పాత్రలో చెప్పేది అర్థం నాకు అర్థం కావాలని.. అలాగే నా పాత్ర హిందీలో మాట్లాడాలి.. అప్పుడే నా నటన సహజంగా అనిపిస్తుందని పంకజ్ త్రిపాఠి పంచుకున్నారు. కాగా.. పంకజ్ త్రిపాఠి ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'మెట్రో ఇన్ డినో' ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)