Breaking News

ఏళ్ల తరబడి షూటింగ్‌.. సుజితకు అరకొర పారితోషికం?!

Published on Sat, 08/26/2023 - 08:24

బాలనటిగా కెరీర్‌ ఆరంభించిన సుజిత ఎన్నో సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేసింది. చిన్నప్పటినుంచే నటనలో ఓనమాలు నేర్చుకున్న ఆమె బుల్లితెరపై అనేక సీరియల్స్‌ చేసింది. వదినమ్మ సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇది తమిళంలోని పాండియన్‌ స్టోర్స్‌కు తెలుగు రీమేక్‌. అక్కడ కూడా సుజిత ధనుషే ధనలక్ష్మి అనే ప్రధాన పాత్రలో నటిస్తోంది. దాదాపు 5 ఏళ్లుగా ఈ ధారావాహిక విజయవంతంగా కొనసాగుతోంది.

తను ఎంత బిజీగా ఉన్నా ఈ సీరియల్‌ షూటింగ్‌ కోసం టైం కేటాయించేది సుజిత. మొదటి నుంచి ఇప్పటివరకు ఎంతోమంది ఆర్టిస్టులు మారుతూ వచ్చారు, కానీ కొన్ని పాత్రలు, నటులు మాత్రం అలాగే ఉండిపోయారు. తాజాగా ఆమె ఈ సీరియల్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుందట. అంతేకాదు, ఈ సీరియల్‌కు సీక్వెల్‌లోనూ నటించనని తెగేసి చెప్పేసిందట! చాలాకాలం నుంచి తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుందట.

ఈ విషయం తెలిసిన సీరియల్‌ మేకర్స్‌ వెంటనే ఆమెను సంప్రదించి ఇక మీదట ఎక్కువ రెమ్యునరేషన్‌ ఇస్తామని హామీ ఇచ్చారట. దీంతో సుజిత సీరియల్‌ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి డబ్బులు ఇవ్వకుండా విసిగించడం వల్లే తనకు సీరియల్‌ నుంచి తప్పుకోవాలనే ఆలోచన వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. ఇకపోతే సుజిత దర్శకనిర్మాత ధనుష్‌ను పెళ్లాడింది. వీరికి ధన్విన్‌ అనే బాబు ఉన్నాడు. సుజిత అన్నయ్య ప్రముఖ డైరెక్టర్ సూర్యకిరణ్ అన్న సంగతి తెలిసిందే!

చదవండి: ఇలాంటి సినిమాలకు అవార్డులు ఇస్తే దేశసమైక్యత దెబ్బతింటుంది

Videos

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)