Breaking News

25 ఏళ్లుగా ఇండస్ట్రీలో.. పేరు వచ్చినా అవకాశాలు రావడం లేదు: నటుడు

Published on Fri, 03/14/2025 - 15:36

కష్టపడు.. ఫలితం ఆశించకు అంటుంటారు. కానీ ఏళ్లతరబడి కష్టపడుతూనే ఉన్నా ఫలితం దక్కకపోతే ఎలా ఉంటుంది? తనదీ అదే పరిస్థితి అంటున్నాడు పంచాయత్‌ నటుడు దుర్గేశ్‌ కుమార్‌ (Durgesh Kumar). పంచాయ్‌ సిరీస్‌, లాపతా లేడీస్‌ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడికి అవకాశాలు రావడం లేదట! తాజాగా దుర్గేశ్‌ కుమార్‌ ఓ ఇంటర్వ్యూలో తన గోడు వెల్లబోసుకున్నాడు. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లవుతోంది. ఇప్పటికీ అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నాను. 

ఆడిషన్స్‌కు కూడా పిలవట్లేదు
కష్టాలు నాకు చుట్టాలు కాదు, ఇంటిమనుషులైపోయాయి. అందరూ పంచాయత్‌ సిరీస్‌ (Panchayat Web Series)తో నేను సక్సెస్‌ అయ్యాననే చూస్తున్నారు. కానీ ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. గత ఏడాదిన్నర కాలంగా పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌ల నుంచి ఒక్క ఫోన్‌ కాల్‌ రాలేదు. ఆడిషన్‌కు రమ్మని ఎవరూ పిలవలేదు. నా టాలెంట్‌ గుర్తించిన చిన్న నిర్మాతలతోనే నేను ఎక్కువగా పని చేస్తున్నాను. ఇప్పటికీ ఆడిషన్స్‌ కోసం పరిగెడుతూనే ఉన్నాను.

పాపులారిటీ ఫుల్‌.. అవకాశాలు నిల్‌
హైవే, పంచాయత్‌ ప్రాజెక్టులతో నన్ను నేను నిరూపించుకున్నాక కూడా ఎవరూ పెద్దపాత్రలు ఇవ్వడం లేదు. అందరికీ నేను తెలుసు. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు. నా పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో తెలియడం లేదు. ఇంకో విషయమేంటంటే.. నేను నటించిన సినిమాలు అవార్డులు సాధిస్తున్నాయి. పలువురు సినీవిశ్లేషకులు ఆయా సినిమాలను మెచ్చుకుంటున్నారు కానీ అందులో ఎక్కడా నా పేరు ప్రస్తావించడం లేదు. 

పంచాయత్‌తో ట్రెండింగ్‌లో..
నాకు రావాల్సిన క్రెడిట్‌ ఎప్పుడూ రాదు. కనీసం ప్రేక్షకులైనా నా పనిని గుర్తించినందుకు గర్విస్తున్నాను అన్నాడు. సరైన పని దొరక్కపోవడం వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దుర్గేశ్‌.. హైవే, సుల్తాన్‌, సంజు, ధడక్‌, భక్షక్‌ వంటి చిత్రాల్లో నటించాడు. పంచాయత్‌ సిరీస్‌ నటుడిగా అతడికి ఎక్కువ గుర్తింపు తెచ్చింది.

చదవండి: రజనీకాంత్‌ భార్యగా ఛాన్స్‌ ఇప్పిస్తాం.. కాకపోతే ఒక కండీషన్‌!

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)