Breaking News

షోయబ్ మాలిక్‌తో ఎఫైర్? ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన పాక్ నటి

Published on Wed, 01/24/2024 - 12:10

పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి.. రీసెంట్‌ టైంలో సెన్సేషన్ అయిపోయింది. ఎందుకంటే గతకొన్నాళ్ల నుంచి షోయబ్-సానియా విడాకులపై వార్తలు వచ్చాయి. తాజాగా జరిగిన పెళ్లితో అది నిజమేనని తేలిపోయింది. షోయబ్.. పాక్ నటి సనా జావేద్‌ని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్ల ముందు మరో పాక్ నటి.. ఈ ఆటగాడితో ఎఫైర్ నడిపిందని రూమర్స్ వచ్చాయి. ఆ బ్యూటీ సదరు పుకార్లపై ఇన్నాళ్లు ఓ క్లారిటీ ఇచ్చింది. అప్పట్లో తను ఎంతగా బాధపడ్డాననేది బయటపెట్టింది.

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. చాలా ఏళ్ల నుంచి జట్టులో ఉన్నాడు. 2002లో ఆయేషా సిద్ధిఖీని, 2010లో సానియా మీర్జాని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అంటే 2024లో పాక్ నటి సనా జావేద్‌తో ఒక్కటయ్యాడు. అయితే కొన్నాళ్లముందు ఆయేషా ఒమర్ అనే నటితో షోయబ్.. ఓ మ్యాగజైన కవర్ పేజీ కోసం ఫొటో షూట్ చేశాడు. ఇందులో వీళ్లిద్దరూ వేరే లెవల్ కెమిస్ట్రీ పండించారు. సరిగ్గా అదే టైంలో సానియా విడాకులు తీసుకోబోతుందనే న్యూస్ బయటకొచ్చింది. దీంతో ఆయేషా బలైపోయింది.

(ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

షోయబ్.. సానియాకు విడాకులు ఇచ్చేశాడని, దానికి ఆయేషా ఒమర్ కారణమని తెగ మాట్లాడుకున్నారు. మన దగ్గర ఊరికే మాట్లాడుకున్నారు. పాక్ మీడియాలో అయితే ఇష్టమొచ్చినట్లు రాసిపడేశారు. అయితే ఆ సమయంలో తను చాలా ఆందోళనకు గురయ్యానని ఆయేషా చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎఫైర్ రూమర్స్ వల్ల తాను ఎంతలా మానసిక వేదన అనుభవించాననేది బయటపెట్టింది.

'ఆ దశ మొత్తం నాకు ఓ పీడకల లాంటిది. షోయబ్‌తో నాకు ఎఫైర్ సృష్టించడంతో పాటు పెళ్లి కూడా చేసేశారు. ఇంకా చెప్పాలంటే నాకు అతడితో సీక్రెట్‌గా పెళ్లయిపోయిందని నా బంధువులే చాలామంది నమ్మేంతలా పరిస్థితి చేయి దాటిపోయింది. అయితే నాకు ఈ పుకార్లు చదివినప్పుడు.. అలానే నా గురించి జనాలు మాట్లాడుకునేప్పుడు చాలా అంటే చాలా భయమేసేది. తెగ ఆందోళనపడేదాన్ని' అని ఆయేషా ఒమర్ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: 'నెరు' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ))

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)