Breaking News

పాక్ నటుడితో అమీషా పటేల్ రొమాంటిక్ డ్యాన్స్.. వీడియో వైరల్‌

Published on Mon, 06/15/2026 - 14:06

బద్రి, నాని, నరసింహుడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి అమీషా పటేల్‌. 51 ఏళ్ల వయసులోనూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ నటుడు ఇమ్రాన్ అబ్బాస్.. అమీషా పటేల్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక పాత రొమాంటిక్ డ్యాన్స్ వీడియో అది. 

జూన్‌ 9న అమీషా పటేల్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా ఇమ్రాన్‌ ఆమెకు విషెస్‌ తెలియజేస్తూ..గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘క్రాంతి’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘దిల్ మే దర్ద్ సా జగా హై’ పాటకు సంబంధించిన వీడియో క్లిప్పుని ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. గతంలో వీరిద్దరూ ఒక ఈవెంట్ నిమిత్తం బహ్రెయిన్‌లో కలుసుకున్నప్పుడు ఈ వీడియోను చిత్రీకరించారు. ‘నాకెంతో ఇష్టమైన పాటల్లో ఒకటైన ఈ సాంగ్‌కు నీతో కలిసి వీడియో చేయడం మర్చిపోలేని అనుభూతి’ అంటూ ఇమ్రాన్ అబ్బాస్ ఈ వీడియోను షేర్ చేస్తూ అమీషాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పాకిస్తానీ నటుడితో అమీషా పటేల్ అంత క్లోజ్‌గా మూవ్ అవ్వడం, రొమాంటిక్ వీడియోలు చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ గతంలో నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని అమీషా, ఇమ్రాన్ అబ్బాస్‌తో ప్రేమలో ఉందంటూ వస్తున్న వార్తలపై ఆమె గతంలోనే స్పందించారు. తామిద్దరం కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని, ఇద్దరం ఒంటరిగా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారని, వాటిని చూసి నవ్వుకున్నానని ఆమె కొట్టిపారేశారు. ఏదేమైనప్పటికీ, భారత్-పాక్ సరిహద్దులను దాటిన వీరి స్నేహం, ఈ క్యూట్ రొమాంటిక్ వీడియో ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌తో పాటు ఇరు దేశాల సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ట్రెండింగ్‌గా మారింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)