Breaking News

ఓటీటీ సినిమా రివ్యూ.. కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్‌టైనర్

Published on Wed, 06/18/2025 - 09:39

సింపుల్ బడ్జెట్, డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు తీయడంలో మలయాళ దర్శకుల తర్వాత ఎవరైనా. ఎందుకంటే రీసెంట్ టైంలో అలా వచ్చిన పలు చిత్రాలు అటు థియేటర్లలో ఇటు ఓటీటీల్లో దుమ్మురేపుతున్నాయి. అలాంటి ఓ చిత్రమే 'పడక్కళమ్'. ఓవైపు నవ్విస్తూనే కన్ఫ్యూజన్‌ కామెడీతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉంది? దీని సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
ఓ ఇంజినీరింగ్ కాలేజీ. షాజీ(సూరజ్ వెంజరమోడు) అనే ప్రొఫెసర్. ఆయన డిపార్ట్‌మెంట్ హెచ్ఓడీని సస్పెండ్ చేయడంతో ఆ స్థానంలోకి షాజీ వెళ్తాడు. అదే కాలేజీలో పనిచేస్తున్న మరో ప్రొఫెసర్ రంజిత్(షరాఫుద్దీన్)కి ఇది నచ్చదు. దీంతో తన దగ్గరున్న మాయాపెట్టెతో షాజీని తన కంట్రోల్‌కి తీసుకుని ఆటాడిస్తాడు. ఇదంతా జతిన్(సందీప్ ప్రదీప్) అనే కుర్రాడు చూసేస్తాడు. తన ఫ్రెండ్స్‌కి చెబుతాడు. కానీ వాళ్లు నమ్మరు. దీంతో రంజిత్ బ్యాగ్‌ని దొంగిలించడానికి జతిన్ ప్రయత్నిస్తాడు. తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల జతిన్ శరీరంలో రంజిత్, రంజిత్ బాడీలోకి షాజీ, షాజీ శరీరంలోకి జతిన్ ఆత్మలు ప్రవేశిస్తాయి. అసలు ఎందుకిలా జరిగింది? చివరకు ఏమైంది అనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ సినిమాలు అనగానే హా ఏముంది లవ్ స్టోరీ అయ్యింటుందిలే అనుకుంటాం. కానీ ఇందులో 'జంబలకిడిపంబ' తరహాలో ఒకరి శరీరంలో మరొకరు ప్రవేశించడం అనే కాన్సెప్ట్‌ని జోడించడం కాస్త కొత్తగా అనిపించింది. పడక్కళమ్ అంటే యుద్ధభూమి అని అర్థం. సినిమా ప్రారంభంలోనే ఓ రాజ్యం, యుద్ధం అని మొదలుపెడతారు. ఓ మాయ పెట్టె గురించి చెబుతారు. కట్ చేస్తే ప్రస్తుతానికి వచ్చేస్తాం. కాలేజీలో జతిన్ గ్యాంగ్ చేసే అల్లరి, షాజీ-రంజిత్ పాత్రలు కాస్త నవ్విస్తాయి. అలా అలా ఫస్టాప్ అయిపోతుంది. సరిగ్గా ఇంటర్వెల్ సమయానికి ప్రధాన పాత్రధారులు ముగ్గరు.. ఒకరి శరీరాల్లోకి ఒకరు వెళ్లడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.

సెకండాఫ్ అంతా కూడా ఒకరి శరీరంలోకి ప్రవేశించిన మరొకరు అసలు ఏం చేశారు? చివరకు మళ్లీ యాధావిధిగా వచ్చేశారా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీస్‌తో పోలిస్తే ఈ సినిమా బాగుంది. కాకపోతే ఫస్టాప్ సరదాగా సాగిపోయినప్పటికీ.. సెకండాఫ్ మాత్రం కన్ఫ్యూజన్ కామెడీతో కొంతమేర ఆకట్టుకుంది. అక్కడక్కడ థ్రిల్లింగ్‌గా అనిపించినా లాజిక్స్ లాంటివి ఏం పట్టించుకోకుండా చూస్తే టైమ్ పాస్ అయిపోతుంది. చివర్లో కాస్త ఎమోషన్ సీన్స్ పడేసరికి ఓ మంచి సినిమా చూశాంలే అనే ఫీలింగ్ కలుగుతుంది.

ఎవరెలా చేశారు?
ఈ సినిమాలో జతిన్‌గా చేసిన సందీప్ ప్రదీప్‌కి ఎక్కువ స్కోప్ దొరికింది. ఫస్టాప్ అంతా అమాయక కుర్రాడిగా, సెకండాఫ్ అంతా అగ్రెసివ్‌గా పాత్రలో ఆకట్టుకున్నాడు. విలనీ లక్షణాలున్న పాత్రలో షరాఫుద్దీన్ కూడా మెప్పించాడు. సూరజ్ వెంజరమోడు పాత్ర కూడా బాగుంది కానీ ఇంకాస్త మంచిగా సీన్స్ పడుంటే బాగుంటుంది కదా అనిపించింది. మిగతా పాత్రధారులు ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే.. కాలేజీలో జరిగే కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్‌టైనర్ సింపుల్ బడ్జెట్‌లో తీసేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఓకే ఓకే. డైరెక్షన్ కూడా పర్లేదు. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాసేపు అలా ఫ్యామిలీతో కలిసి నవ్వుకుందాం అనుకుంటే ఈ సినిమాపై ఓ లుక్కేయొచ్చు.

- చందు డొంకాన

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)