Breaking News

వికటకవి సిరీస్‌కు ఉత్తమ దర్శకుడిగా ప్రదీప్‌.. ఈ సిరీస్‌ ఏ ఓటీటీలో ఉందంటే?

Published on Mon, 03/24/2025 - 15:04

హిందూస్తాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025 (OTTPlay Awards 2025) మూడవ ఎడిషన్ మార్చి 22న ముంబైలో ఘనంగా జరిగింది. అపరశక్తి ఖురానా, కుబ్రా సైత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు దక్కాయి. 'డిస్పాచ్' సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా మనోజ్ బాజ్‌పాయ్, 'భామ కలాపం 2' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ప్రియమణి, 'ది రాణా దగ్గుబాటి షో'తో ఉత్తమ టాక్ షో హోస్ట్‌గా రానా దగ్గుబాటితో సహా పలువురికి అవార్డులు ప్రదానం చేశారు. 

ఓటీటీలో బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డ్‌
జీ5లో స్ట్రీమ్ అవుతున్న సూపర్ హిట్ సిరీస్ వికటకవి (Vikkatakavi Web Series)కి గాను ప్రదీప్ మద్దాలి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. నిఖిల్ అద్వానీ (ఫ్రీడమ్ ఎట్ నైట్)తో కలిసి ఉత్తమ దర్శకుడు (వెబ్ సిరీస్) అవార్డును ప్రదీప్ మద్దాలి పంచుకున్నారు. అనంతరం  ప్రదీప్ మద్దాలి.. హిందూస్తాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డ్స్‌కు, అతని తల్లిదండ్రులకు, సిరీస్‌ యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపుతో తనపై బాధ్యత మరింత పెరిగినట్లు చెప్పారు. 

ఆ ఘనత సాధించిన తొలి తెలుగు సిరీస్‌ ఇదే
1970ల నాటి కల్పిత గ్రామమైన అమరగిరిలో ప్లేగు వ్యాధి నేపథ్యంలో ఆకట్టుకునే గ్రామీణ థ్రిల్లర్ వికటకవి. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య డిటెక్టివ్ రామ కృష్ణగా నటించారు. మేఘా ఆకాశ్ మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు. వర్ధమాన దర్శకుడు ప్రదీప్ మద్దాలి.. ఇంజనీరింగ్, ఐటీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. '47 డేస్', 'సర్వం శక్తి మయం'తో టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వికటకవితో దర్శకుడిగా మరో స్థాయికి వెళ్ళారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శించిన మొదటి తెలుగు వెబ్ సిరీస్ వికటకవి కావడం విశేషం.

చదవండి: హీరో నితిన్‌పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్‌కు రానన్నా: హర్షవర్ధన్‌

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)