సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'షట్టర్‌ ఐలాండ్‌' మూవీ రివ్యూ

Published on Sun, 12/28/2025 - 07:00

ఓటీటీలో థ్రిల్లర్‌ సినిమాలకు క్రేజెక్కువ. అలాంటి ఓ థ్రిల్లర్‌ సినిమా గురించి ఇప్పుడు చెప్పుకుందాం. హాలీవుడ్‌ స్టార్‌ లినార్డో డికాప్రియో ప్రధాన పాత్ర పోషించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ షట్టర్‌ ఐల్యాండ్‌. మార్టిన్‌ స్కోర్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు,మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అందుబాటులో ఉంది.. ఆ సినిమా రివ్యూ చూసేద్దాం..

కథ
షట్టర్‌ ఐలాండ్‌ ద్వీపంలో ఓ పిచ్చి ఆసుపత్రి ఉంటుంది. క్రూరమైన హింసలు చేసిన ఖైదీలకు ఆ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుంటారు. అక్కడ ఓ ఖైదీ/రోగి తప్పించుకుందన్న విషయం తెలిసి హీరో టెడ్డీ ఒక మార్షల్‌గా (పోలీస్‌గా) తన పార్ట్‌నర్‌తో కలిసి ఆ హాస్పిటల్‌కు వెళ్తాడు. ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు విచారణ మొదలు పెడతారు. అయితే అక్కడ అందరి ప్రవర్తన కాస్త వింతగా ఉంటుంది. 

హీరో కేవలం ఖైదీని కనిపెట్టడం కోసమే రాడు.. ఆస్పత్రిలో కొన్ని అసాధారణమైనవి జరుగుతున్నాయని అతడి అనుమానం. మానసికంగా జబ్బుపడినవారి మెదడుపై అక్కడ ప్రయోగాలను చేస్తున్నారని దాన్ని ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటాడు. తుపానును సైతం లెక్క చేయకుండా విచారణ కొనసాగిస్తాడు. ఈ క్రమంలో తన పార్ట్‌నర్‌ను కోల్పోతాడు. అక్కడి నుంచి కథ వేగం పుంజుకుంటుంది. అసలు ఆస్పత్రిలో ఏం జరుగుతోంది? ఆ మిస్టరీని హీరో చేధించాడా? లేదా? అతడి సహచరుడు ఏమయ్యాడు? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే?
సినిమా ప్రారంభంలో మనం కూడా మిస్టరీ కోసం కళ్లు పెద్దవి చేసుకుని చూస్తాం. కానీ మూవీ ఎంత ముందుకు కదిలినా ఒక్క మిస్టరీ కూడా బయటపడదు. మరోవైపు హీరో అనారోగ్యానికి గురవుతుంటాడు. అతడి గతం తాలూకు ఊహలు, పీడకలలు ఆయన్ని వెంబడిస్తుంటాయి. దీనికి తోడు మైగ్రేన్‌.. ఈ నొప్పి నుంచి ఉపశమనం కలిగేందుకు వైద్యుడు టెడ్డీకి మందులిస్తాడు. 

ఈ మందులవల్ల తనను మానసిక రోగిని చేస్తున్నారేమోనన్న భయంతో హీరో వాటిని వేసుకునేందుకు నిరాకరిస్తాడు. ఇదంతా బాగానే ఉంటుంది.. కానీ అసలు ట్విస్ట్‌ క్లైమాక్స్‌లో రివీల్‌ చేస్తారు. అప్పుడు హీరోలాగే మనక్కూడా ఏది నిజం? ఏది అబద్ధం? అని కొంతసేపు అయోమయానికి గురవుతాం. చివరకు హీరో పరిస్థితి చూసి జాలిపడకుండా ఉండలేం. 

క్లైమాక్స్‌ కాస్త నిరుత్సాహానికి గురిచేసినా సినిమా మాత్రం ఆసక్తికరంగా కొనసాగుతుంది. హీరో యాక్టింగ్‌ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా వర్కవుట్‌ అయింది. వీలున్నప్పుడు కచ్చితంగా ఓసారి చూడొచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌లోనూ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

Videos

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు

ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్

Photos

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)