Breaking News

Oscars 2024: ప్చ్‌.. ఉన్న ఒక్క ఆశ కూడా పోయింది..

Published on Mon, 03/11/2024 - 12:32

గతేడాది ఆర్‌ఆర్‌ఆర్‌ (బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నాటునాటు పాటకు), ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ ( బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలింగా) సినిమాలకు ఆస్కార్‌ రావడంతో భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. కానీ ఈసారి ఇండియా నుంచి ఏ సినిమా కూడా అకాడమీ అవార్డుల బరిలో లేకపోవడంతో అందరూ నిరాశ చెందారు. కొన్ని సినిమాలను నామినేట్‌ చేసినప్పటికీ ఫైనల్‌ లిస్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాయి. అయితే భారత సంతతికి చెందిన విదేశీవాసి సినిమా ఆస్కార్‌ బరిలో ఉండటంతో అందరూ కాస్త ఆసక్తి చూపించారు.

టు కిల్‌ ఎ టైగర్‌..
ఢిల్లీకి చెందిన కెనడావాసి నిషా పహుజా.. టు కిల్‌ ఎ టైగర్‌ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించింది. గతేడాది అక్టోబర్‌లో ఏ డిస్ట్రిబ్యూటర్‌ సాయం లేకుండా అమెరికాలోని కొన్ని థియేటర్లో విడుదల చేసింది. ఆస్కార్‌కు ఎప్పుడైతే నామినేట్‌ అయిందో అందరూ ఈ చిత్రంపై ఆసక్తి చూపించారు. దీంతో ఫిబ్రవరిలో రీరిలీజ్‌ చేయడం, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ హక్కులను కొనుక్కోవడం చకచకా జరిగిపోయాయి. ఇండియాలో మాత్రం థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే వచ్చేసింది. ఆదివారం (మార్చి 10) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. భారత్‌కు చెందిన ప్రియాంక చోప్రా, దేవ్‌ పటేల్‌, మిండీ కలింగ్‌, రూపీ కౌర్‌ ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలుగా వ్యవహరించారు.

ఏ సినిమాకు వచ్చిందంటే?
తాజాగా జరిగిన ఆస్కార్‌ వేడుకల్లో ఈ మూవీని వెనక్కు నెట్టి '20 డేస్‌ ఇన్‌ మరియుపోల్‌' ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అకాడమీ అవార్డు ఎగరేసుకుపోయింది. ఈ సినిమాలో స్పెషల్‌ ఏముందంటారా? ఉక్రెయిన్‌- రష్యా మధ్య భీకర వార్‌ జరుగుతుంది. మారియుపోల్‌ నగరంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌ జర్నలిస్టులు రష్యా దురాగతాలను ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రయత్నిస్తారు. వారి పోరాటమే సినిమా కథ!

చదవండి: 'ఓపెన్ హైమర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)