Breaking News

Angela Bassett: హృదయాలను ధైర్యంతో నింపుకోండి!

Published on Thu, 01/11/2024 - 05:58

ఆస్కార్‌ అకాడమీ పద్నాలుగో ఆనరరీ అవార్డుల ప్రదానం అమెరికాలో జరిగింది. 2023 సంవత్సరానికిగాను నటి ఏంజెలా బాసెట్, నటుడు– రచయిత–ఫిల్మ్‌ మేకర్‌ మెల్‌ బ్రూక్స్, ఫిల్మ్‌ ఎడిటర్‌ కరోల్‌ లిటిల్టన్, సన్‌డాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మిచెల్‌ సాటర్‌లకు ఈ అవార్డులను ప్రదానం చేసింది అకాడమీ. అయితే ఈ వేడుక గత ఏడాది నవంబరు 18న జరగాల్సింది. కానీ హాలీవుడ్‌లో రచయితలు, నటీనటులు చేసిన సమ్మెల కారణంగా ఈ వేడుక వాయిదా పడింది.

తాజాగా ఈ అవార్డు ప్రదానోత్సవం అమెరికాలో జరిగింది. ఈ గౌరవ పురస్కారాల అవార్డు విభాగంలో రెండో అవార్డును గెలుచుకున్న బ్లాక్‌ లేడీగా నిలిచారు ఏంజెలా బాసెట్‌. తొలిసారిగా నటి సిసిలీ టైసన్‌ ఈ గౌరవాన్ని ΄÷ందారు. ‘‘ఈ విభాగంలో నేను అవార్డు అందుకున్నందుకు ఆమె (సిసిలీ) స్వర్గంలో ఆనందంగా ఉండి ఉంటారు. నా తోటి బ్లాక్‌ యాక్ట్రస్‌ అందరికీ చెబుతున్నాను. మీ హృదయాలను ధైర్యంతో నింపుకోండి. ధృడంగా ఉండండి’’ అంటూ అవార్డు అందుకున్న అనంతరం ఏంజెలా బాసెట్‌ ఉద్వేగంగా ప్రసంగించారు.

‘‘మీ సహచరులు మీ పనిని మెచ్చుకున్నప్పుడు మరియు వారు ఈ బంగారు విగ్రహంతో అభినందించినప్పుడు కలిగే ఆనందమే వేరు. ఈ పురస్కారానికి నా మనసులో ఎప్పటికీ గౌరవం ఉంటుంది. అందుకే ఈ అవార్డును అమ్మను సుమా..’’ అని చమత్కరించారు మెల్‌ బ్రూక్స్‌. ఈ వేడుకలో టామ్‌ హాంక్స్, జూలియన్నే మూర్, మార్గొట్‌ రాబీ, కోల్మన్‌ డొమింగో వంటి హాలీవుడ్‌ ప్రముఖులు ΄ాల్గొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... చిత్రసీమకు విశిష్టమైన సేవలు అందించిన వారికి ఈ హానరరీ అవార్డులను ప్రదానం చేస్తుంటారు. మరోవైపు ఈ ఏడాది మార్చిలో 96వ ఆస్కార్‌ అవార్డుల వేడుక లాస్‌ ఏంజెల్స్‌లో జరగనుంది. జనవరిలో నామినేషన్స్‌ వెల్లడి కానున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)