కీచక డాక్టర్ కి బడితపూజ.. చెప్పులతో దేహశుద్ధి చేసిన మహిళలు
Breaking News
ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్.. అదే ఆయన స్పెషాలిటీ
Published on Mon, 03/16/2026 - 10:39
98వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ నిలిచాడు. సిన్నర్స్ చిత్రంలోని నటనకు ఆయనను ఈ అవార్డు వరించింది. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో వహించిన సిన్నర్స్ చిత్రంలో జోర్డాన్ ద్విపాత్రాభినయంలో కనిపించి కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శనను కనబరిచారు. ఒకే చిత్రంలో కవలలుగా నటించి ఆస్కార్ గెలుచుకున్న తొలి నటుడిగా ఆయన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అలాగే, ఈ విభాగంలో ఆస్కార్ అందుకున్న ఆరో నల్లజాతీయుడిగా నిలిచారు.
బుల్లితెర టు వెండితెర
చిత్ర పరిశ్రమలో రాణించడం అంతా ఈజీ కాదు. స్టార్ హోదా సంపాదించాలంటే చాలానే కష్టపడాలి. ఈ విషయంలో మైఖేల్ బీ జోర్డాన్ సినీ ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకమైన పాఠం అని చెప్పాలి. బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి..వెండితెరపై రాణిస్తున్నాడు. చిన్నప్పుడు మోడలింగ్‌తో మొదలుపెట్టి, 'ది వైర్' (The Wire), 'ఫ్రైడే నైట్ లైట్స్' (Friday Night Lights) వంటి టీవీ సిరీస్‌ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
2013లో వచ్చిన 'ఫ్రూట్‌వేల్ స్టేషన్' ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆస్కార్ గెలిచిన 'సిన్నర్స్' దర్శకుడు ర్యాన్ కూగ్లర్‌తో ఆయనకు ఇది మొదటి సినిమా. ఇందులో మైఖేల్ నటనకు హాలీవుడ్ ఫిదా అయింది. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే కమర్షియల్ సక్సెస్ మాత్రం 'క్రీడ్' చిత్రంతో వచ్చింది. ఇక మార్వెల్ చిత్రం బ్లాక్ పాంథర్ లో ఆయన పోషించిన 'కిల్‌మాంగర్' పాత్ర హాలీవుడ్ చరిత్రలోనే అత్యుత్తమ విలన్ పాత్రలలో ఒకటిగా నిలిచిపోయింది.
అదే ఆయన ప్రత్యేకత
సామాజిక సందేశాన్నిచ్చే చిత్రాల్లో నటిస్తూ.. వైవిధ్యమైన పాత్రలు పోషించడం ఆయన స్పెషల్. హీరోగానే కాకుండా.. పాత్ర నచ్చితే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాడు. హీరోగా బిజీ ఉన్న సమయంలోనే 'బ్లాక్ పాంథర్’లో విలన్‌గా నటించాడు.నటుడిగానే కాకుండా దర్శకుడిగాను రాణించాడు. 'క్రీడ్ III' చిత్రంతో ఆయన దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా కథా గమనాన్ని నడిపించడంలోనూ ఆయనది ప్రత్యేక.
Tags : 1