Breaking News

గజినిలా మారిపోయిన ఓరీ.. సడన్‌గా ఎందుకిదంతా?

Published on Fri, 11/01/2024 - 19:31

అల్లాటప్పాగా తిరుగుతూ, చిత్రవిచిత్రంగా పోజులిస్తూ ఫేమస్‌ అయ్యాడు ఓరీ. బాలీవుడ్‌ పార్టీలకు హాజరవుతూ, అక్కడున్నవారితో ఫోటోలు దిగుతూ రెండు చేతులా సంపాదించుకుంటున్నానంటాడు. తాజాగా ఇతడు బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌లా మారిపోయాడు. ఆమిర్‌ సినిమా లుక్స్‌ను రీక్రియేట్‌ చేస్తూ స్పెషల్‌ ఫోటోషూట్‌ చేశాడు.

ఆ పోస్టర్లను రీక్రియేట్‌ చేసిన ఓరీ
సినిమా టైటిల్స్‌లోనూ తన పేరును ఇరికించేశాడు. ఈ పోస్టర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన గజిని, తారే జమీన్‌ పర్‌, లగాన్‌, దిల్‌ చహ్తా హై, రంగ్‌దే బసంతి, తలాష్‌, 3 ఇడియట్స్‌, మంగళ్‌ పాండే, పీకే, దంగల్‌, రాజా హిందుస్తానీ ఇలా అన్ని సినిమా పోస్టర్లను రీక్రియేట్‌ చేశాడు. దీని గురించి ఓరీ మాట్లాడుతూ.. '18 ఏళ్లకంటే చిన్నవారికి ఆమిర్‌ ఖాన్‌ సినిమాలు తెలిసి ఉండకపోవచ్చు. 

అందుకోసమే ఇదంతా..
ఉదాహరణకు తారే జమీన్‌ పర్‌ వచ్చి 17 ఏళ్లవుతోంది. ఇప్పుడు 17 ఏళ్ల వయసున్న వారికి ఈ సినిమా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడే కదా వాళ్లు ఈ లోకంలో అడుగుపెట్టింది. యంగ్‌ జెనరేషన్‌లోని చాలామందికి ఈ సినిమాలన్నీ తెలిసి ఉండవు.  అలాంటివారికి ఆమిర్‌ గురించి, ఆయన టాలెంట్‌ గురించి కచ్చితంగా తెలియాలనే ఇలా చేశాను.

బహుముఖ ప్రజ్ఞాశాలి
అనుకున్నట్లుగానే అందరిలోనూ ఈ సినిమాల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతను ప్రేరేపించాను. ఆమిర్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. తన చిత్రాల ద్వారా ఏదో ఒక సందేశాన్ని సమాజానికి ఇచ్చేవారు. మూవీలో నటించడమే కాకుండా నిర్మాతగా, డైరెక్టర్‌గానూ పని చేశాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కానీ ఇంతవరకు ఆయనను కలుసుకోలేదు.

ఎంత ఖర్చయిందంటే?
ఈ మూవీ పోస్టర్లు రీక్రియేట్‌ చేయడానికి నాకు రూ.1.5 లక్షలు ఖర్చయింది. ప్రతి పోస్టర్‌కు హెయిర్‌స్టైల్‌ మారిపోతూ ఉండాలి. అదే అన్నింటికంటే కష్టంగా అనిపించింది. ఈ సినిమాలన్నింటిలో నాకు బాగా నచ్చినది గజిని' అని చెప్పుకొచ్చాడు.

 

 

చదవండి: అద్దె కట్టేందుకు డబ్బుల్లేవు.. అయినా పైసా తీసుకోకుండా ఐటం సాంగ్స్‌!

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)