Breaking News

కంటతడి పెట్టించిన చిత్రానికి ‘ఆస్కార్‌’.. ఏ ఓటీటీలో ఉందంటే?

Published on Mon, 03/16/2026 - 12:40

ఒక సినిమాకు ఆస్కార్‌ అవార్డు రావడం అంటే మామూలు విషయం కాదు.కేవలం భారీ బడ్జెట్, హంగులు ఉంటే సరిపోదు,ఆ సినిమా వెనుక ఒక బలమైన ఆత్మ ఉండాలి. సమాజానికి అవసరమైన సందేశం, మనుషుల మధ్య సంబంధాలు, సామాజిక అసమానతలు లేదా మానవీయ విలువల చుట్టూ తిరిగే కథలకే ఆస్కార్‌ టీమ్‌ ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. 98వ అకాడమీ అవార్డుల్లోనూ అదే జరిగింది. 

తండ్రి, కూతుళ్ల ఎమోషన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’కి ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. అంతేకాదు ఉత్తమ దర్శకుడు(పాల్‌ థామస్‌ అండర్సన్‌), ఉత్తమ సహాయ నటుడు(షాన్‌ పెన్‌), ఎడిటింగ్‌(యాండీ జుర్గెన్‌సన్‌ ), కాస్టింగ్‌(కసాండ్రా కులుకుందిస్‌), అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే (పాల్‌ థామస్‌ అండర్సన్‌ )తో పాటు మొత్తం ఆరు ఆస్కార్‌ అవార్డులు అందుకొని  ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ రికార్డు సృష్టించింది.

‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ కథేంటి?
బ్లాక్‌ కామెడీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమే ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’. మాజీ విప్లవకారుడు బాబ్‌ పాత్రలో ‘టైటానిక్‌’ ఫేమ్‌ లియోనార్డో డికాప్రియో నటించాడు. బాంబ్‌, పెర్ఫిడియా బేవర్లీ హిల్స్‌ (టియానా టేలర్‌) కలిసి సహజీవనం చేస్తుంటారు.పెర్ఫిడియా బేవర్లీ హిల్స్‌కి విప్లవ భావజాలం ఎక్కువ. ఓసారి వలసదారులను విడిపించే క్రమంలో అక్కడి కమాండింగ్‌ అధికారి స్టీవెన్‌ని ఆమె అవమానిస్తుంది. దీంతో పెర్ఫిడియాపై స్టీవెన్‌ పగపెంచుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత ఓ కేసులో ఆమెను పట్టుకొని..తనతో గడిపితే వదిలేస్తానని ఆఫర్‌ ఇస్తాడు. దీనికి పెర్ఫిడియా ఒప్పుకుంటుంది. అతని కారణంగా ఓ బిడ్డకు జన్మనిస్తుంది. 

బిడ్డ కోసం తండ్రి పోరాటం
కొన్నాలకు ఆ చిన్నారితో పాటు తన జీవిత భాగస్వామి బాబ్‌ని వదిలేసి విప్లవ బాట పడుతుంది. దీంతో ప్యాట్‌ ఒంటరి చిన్నారి చార్లీన్‌ను పెంచుతాడు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటారు. కొన్నాళ్ల తర్వాత స్టీవెన్‌కు ఆ చిన్నారి తన కూతురే అనే విషయం తెలుస్తుంది. ఈ విషయం బయటకు వస్తే కెరీరేకే ఇబ్బంది అవుతుందని తెలిసి..ఆమెను చంపేందుకు కుట్రలు పన​ఉనతాడు. ఈ విషయం బాబ్‌కి తెలుస్తుంది. తన కూతురిని కాపాడుకునేందుకు బాబ్‌ ఏం చేశాడు? స్వార్థం తన పరిస్థితులను ఎలా మార్చేసింది? అన్నదే ఈ సినిమా కథ. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషనల్ అండ్ పొలిటికల్ డ్రామా. తన బిడ్డను కాపాడుకునేందుకు తండ్రి పడే తపన తెరపై చూస్తుంటే కన్నీళ్ల ఆగవు.

థామస్ పించన్ రాసిన 'వినైల్యాండ్' (Vineland) నవల ఆధారంగా దర్శకుడు పాల్‌ థామస్‌ అండర్సన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. గతేడాది సెప్టెంబరు 26న వార్నర్‌ బ్రదర్స్‌ నిర్మాణ సంస్థ ఈ సినిమాను విడుదల చేసింది. 175 మిలియన్‌ డాలర్లతో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా  209.6 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులో ఉంది.
 

Videos

కీచక డాక్టర్ కి బడితపూజ.. చెప్పులతో దేహశుద్ధి చేసిన మహిళలు

బాబు, పవన్ ఫోటోలు లేవని.. బీజేపీ ఫ్లెక్సీలు చింపేసిన టీడీపీ నేతలు

చంద్రబాబు అరెస్ట్.. రమణ రియాక్షన్.. KSR దిమ్మతిరిగే కౌంటర్

గ్యాస్ సిలిండర్ పై కేంద్రం కీలక ప్రకటన రెండున్నర రోజుల్లోనే డెలివరీ

చేపల వేటకు వెళ్లి.. మూసీలో మునిగిన ముగ్గురు యువకులు

నాని & వెంకీ మూవీ ఫిక్స్..!

పిన్నెల్లి సోదరులను హింసిస్తున్నారు. బాబుపై మిథున్ రెడ్డి హాట్ కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ అంతకు అంత అనుభవిస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్

ట్రంప్ కు బిగ్ షాక్.. యుద్ధానికి నో చెప్పిన మిత్రదేశాలు

ప్రత్యేక రాష్ట్రం సాధించిన పొట్టి శ్రీరాములుకు జగన్ నివాళులు

Photos

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)