Breaking News

బాక్సాఫీస్ వద్ద 'ది ఒడిస్సీ' ప్రభంజనం.. 2 రోజుల్లోనే రూ.2000 కోట్లు!

Published on Sun, 07/19/2026 - 10:25

ప్రముఖ హాలీవుడ్ సంచలన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మ్యాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హాత్వే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్‌తో జూలై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా, కేవలం రెండు రోజుల్లోనే అటు ఇండియాలో, ఇటు వరల్డ్‌వైడ్‌గా కనకవర్షం కురిపించింది.

ఇండియాలో ఎంతంటే..
తొలి రోజు ఇండియాలో రూ. 17.40 కోట్ల కలెక్షన్స్‌ సాధించిన ఈ చిత్రం రెండో రోజు ఏకంగా రూ. 22 కోట్లను వసూలు చేసింది. మొత్తం రెండు రోజుల్లో రూ. 39.40 కోట్ల షేర్‌ (రూ. 47.03 కోట్ల గ్రాస్‌) కలెక్షన్స్‌ని సాధించింది. ఇండియాలో ముఖ్యంగా ఇంగ్లీష్ వెర్షన్ అత్యధిక వసూళ్లను సాధించగా, తెలుగు, హిందీ, తమిళ వెర్షన్లు కూడా మంచి వసూళ్లను రాబడుతున్నాయి. నోలన్ గత చిత్రం 'ఓపెన్‌హైమర్' ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డును కూడా 'ది ఒడిస్సీ' బ్రేక్ చేయడం విశేషం.  

గ్లోబల్ మార్కెట్‌లో రికార్డు..
గ్లోబల్ మార్కెట్‌లో కూడా క్రిస్టోఫర్ నోలన్ తన పవర్ ఏంటో చూపించారు. ఈ సినిమా నోలన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్లోబల్ ఓపెనింగ్‌గా రికార్డు సృష్టించింది.  ప్రపంచవ్యాప్త మొత్తం వసూళ్లు  257.8 మిలియన్ల డాలర్లు.. అంటే దాదాపు రూ.2,150 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది.  ఇందులో నార్త్ అమెరికా (డొమెస్టిక్) మార్కెట్ నుంచి 120.5 మిలియన్ల డాలర్లు రాగా, మిగిలిన చోట్ల నుంచి 137.3 మిలియన్ల డాలర్లు వసూళ్లు నమోదయ్యాయి.  నోలన్ గత బ్లాక్‌బస్టర్లు అయిన 'ది డార్క్ నైట్ రైజెస్' ($249 మిలియన్లు), 'ఓపెన్‌హైమర్' ($180 మిలియన్లు) వరల్డ్‌వైడ్ ఓపెనింగ్స్ రికార్డులను 'ది ఒడిస్సీ' కేవలం రెండు రోజుల్లోనే దాటేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం కలెక్షన్లు కూడా తోడైతే ఈ నంబర్లు మరింత భారీగా పెరగనున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. 

గమనిక: ఈ పేజీలోని సినిమా బాక్సాఫీస్‌ రిపోర్టులకు సంబంధించిన సమాచారం నేషనల్‌ మీడియా సంస్థలు, ప్రొడక్షన్ హౌస్‌‌లు, సొషల్ మీడియా అకౌంట్లు వెల్లడించిన వివరాల ఆధారంగా పొందుపరచడం జరిగింది. 

Videos

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)