Breaking News

వివాదంలో 'ఒడిస్సీ'.. కనీసం రూ.6 లక్షలు చెల్లించలేరా?

Published on Sun, 07/26/2026 - 14:41

హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన 'ది ఒడిస్సీ'.. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తోంది. మన దేశంలోనూ మంచి టాక్ తెచ్చుకుని రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటేసింది. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడీ చిత్ర యూనిట్ అనుకోని ఓ వివాదంలో చిక్కుకుంది. షూటింగ్ కోసం ఉపయోగించిన ఓ వైకింగ్ నౌకని డ్యామేజీ చేయడంతో పాటు దానికి అయ్యే రిపేర్ ఖర్చులు ఇప్పటికీ చెల్లించలేదని నౌక యజమానులు ఆరోపిస్తున్నారు.

(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

ది గార్డియన్ వెబ్ సైట్ చెప్పిన దాని ప్రకారం.. ఈ వివాదం 'గ్లాడ్ ఆవ్ గిల్‌బెర్గా' అనే వైకింగ్ లాంగ్‌షిప్ రెప్లికాకు సంబంధించినది. వైకింగాలెడెన్ అసోసియేషన్‌కు చెందిన ఈ నౌకని 'ది ఒడిస్సీ' మూవీలో ప్రాచీన గ్రీకు యుద్ధ నౌకగా ఉపయోగించారు. తమ నౌక, క్రిస్టోఫర్ నోలన్ సినిమాలో కనిపించబోతుందనే వార్తతో ఎంతో ఆనందించామని, కానీ షూటింగ్ తర్వాత దెబ్బతిన్న స్థితిలో ఉన్న నౌకను తమకు తిరిగి ఇచ్చారని, మరమ్మతులకు సుమారు 6,000 డాలర్లు(రూ.5.79 లక్షలు) ఖర్చయినా, నిర్మాణ సంస్థ యూనివర్సల్ పిక్చర్స్ ఇప్పటివరకు ఆ మొత్తాన్ని చెల్లించలేదని వైకింగా లెడెన్ అసోసియేషన్ చైర్మన్ పీటర్ ఒలౌసన్ అన్నారు.

మేం కార్మికుల ఖర్చు కూడా అడగడం లేదు. కేవలం మరమ్మతులకు ఉపయోగించిన సామగ్రి ఖర్చు మాత్రమే కోరుతున్నాం. యూనివర్సల్ పిక్చర్స్ లాంటి సంస్థకు 6,000 డాలర్లు పెద్ద మొత్తం కాదు. కానీ మమ్మల్ని పూర్తిగా మరిచిపోయినట్లు అనిపిస్తోందని పీటర్ పేర్కొన్నారు. షూటింగ్ మొదలవడానికి ముందే నౌకకు ఏమైనా నష్టం జరిగితే తామే మరమ్మతులు చేసి, తర్వాత ఆ ఖర్చును నిర్మాతలు తిరిగి చెల్లిస్తారని ఒప్పందం కుదిరిందని ఒలౌసన్ వెల్లడించారు. ఇప్పటికే నౌకకు మరమ్మతులు పూర్తి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చినా, ఏడాదికి అయిపోయినా తమకు చెల్లించాల్సిన డబ్బు అందలేదని అసోసియేషన్ వాదిస్తోంది.

అయితే ఈ ఆరోపణలను యూనివర్సల్ పిక్చర్స్ సంస్థ పూర్తిగా ఖండించింది. నౌకకు సంబంధించిన అన్ని బిల్లులు, మరమ్మతుల ఖర్చుతో సహా పూర్తిగా చెల్లించాం. ఏవైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసేందుకు అసోసియేషన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం అని నిర్మాణ సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. మరి ఇందులో ఎవరు నిజం చెబుతున్నారో ఏంటో?

(ఇదీ చదవండి: 'ఒడిస్సీ'లో చూపించినవి నిజమైన లొకేషన్లే.. ఏది ఎక్కడంటే?)

Videos

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)