Breaking News

ఆ నిర్మాత ఎంతోమందిని వాడుకుని వదిలేశాడు: ప్రేమమ్‌ హీరోయిన్‌

Published on Sat, 06/10/2023 - 10:52

సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు రావాలంటే హీరోయిన్లు కమిట్మెంట్ ఇచ్చి తీరాల్సిందే..! ఇది ఒక్కరి మాట కాదు.. చాలామంది హీరోయిన్లు బహిరంగానే చెప్పిన విషయం. అయితే కొందరు బయటపడతారు.. ఇంకొందరు బయటపడరు. స్టార్ హీరోయిన్లు సైతం తమను నిర్మాతలు, హీరోలు కమిట్‌మెంట్ అడిగినట్లు చెప్పుకొచ్చారు. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు 'క్యాస్టింగ్‌ కౌచ్‌' అనే పదం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది.

(ఇదీ చదవండి: అప్పటినుంచే ప్రేమలో ఉన్నామన్న లావణ్య.. పోస్ట్‌ వైరల్‌)

తాజాగా ఒడియా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత సంజయ్ నాయక్‌పై ఇద్దరు హీరోయిన్లు క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేశారు. ఒడియా 'ప్రేమమ్' సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రకృతి మిశ్రా అనే హీరోయిన్ మీడియా ముందే నిర్మాతపై ఫైర్‌ అయింది. తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి నిర్మాత సంజయ్‌ నాయక్‌ ఎంతోమంది యువతులను లోబరుచుకున్నాడని తెలిపింది. ఆయన అవసరం తీరితే తరువాత ఆ నటి ముఖం కూడా చూడడని సెన్సెషనల్‌ కామెంట్‌​ చేసింది. ఇలాంటి వారి టార్చర్‌ వల్ల ప్రస్తుతం రియాలిటీ షోలు చేసుకుంటూ.. వాటి ద్వారా మంచి నటిగా ప్రూవ్ చేసుకుని, ఇప్పుడు తాను ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నాని తెలిపింది. ప్రకృతి మిశ్రా వ్యాఖ్యలకు మరో నటి జాస్మిన్‌ రథ్‌ మద్ధతు తెలిపింది. తను కూడా సంజయ్‌ బాధితురాలినే అంటూ కామెంట్‌ చేసింది. 

నిర్మాత సంజయ్‌ నాయక్‌ కామెంట్‌:
హీరోయిన్ల ఆరోపణలను సంజయ్‌ నాయక్‌ తప్పుబట్టాడు. ప్రకృతి మిశ్రా, హీరో బాబు సాన్‌ మధ్య జరిగిన వివాదం అందరికీ తెలిసిందే.. ఆ సమయంలో బాబు సాన్‌కు మద్దతు ఇచ్చానన్న అక్కసుతో ప్రకృతి మిశ్రా ఇలాంటి నిరాధారమైన నిందలు వేస్తోందన్నాడు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, ప్రకృతి మిశ్రా చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన మీడియా సంస్థలను కోర్టుకు లాగుతానని సంజయ్‌ తెలిపాడు.

(ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్‌)

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు