Breaking News

మహా కుంభమేళాలో తమన్నా ‘ఓదెల 2’ టీజర్‌

Published on Wed, 02/19/2025 - 19:03

తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్‌, వశిష్ట ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్‌ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా..నాగసాధు పాత్రలో నటిస్తోంది. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్‌కి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఈ మూవీ టీజర్‌ని ఈ నెల 22న కాశీ మహా కుంభమేళాలో రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. కాశీ మహా కుంభమేళాలో లాంచ్ కానున్న మొట్టమొదటి టీజర్ 'ఓదెల 2' కావడం విశేషం.  

ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో నాగసాధు గా కనిపించిన తమన్నా లుక్ డివైన్ వైబ్ తో పవర్ ఫుల్ గా ఉంది.ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశం. సంపత్‌ నంది ఈ సినిమాకు కథ అందించగా, అజనీష్ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూర్చాడు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)