Breaking News

దెయ్యం సినిమాకు వసూళ్లు ఎంతొచ్చాయ్?

Published on Sun, 04/20/2025 - 13:56

35 ఏళ్లొచ్చినా సరే గ్లామరస్ పాత్రలు చేస్తూ అలరిస్తున్న తమన్నా(Tamannaah Bhatia).. తొలిసారి డిఫరెంట్ గా కనిపించిన సినిమా ఓదెల 2(Odela 2 Movie). శివశక్తిగా నటించిన తమన్నా ఈ చిత్రంపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్లు ముంబై, హైదరాబాద్ లో తిరుగుతూ గట్టిగానే ప్రమోట్ చేసింది. మరి ఈ మూవీకి ఇప్పటివరకు వసూళ్లు ఎంతొచ్చాయ్?

తమన్నా, వశిష్ట సింహా నటించిన ఓదెల 2 మూవీ.. రీసెంట్ గా ఏప్రిల్ 17న థియేటర్లలోకి వచ్చింది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో తొలి రెండు రోజుల్లో రూ.2-3 కోట్ల మాత్రమే వచ్చాయనే టాక్ వినిపించింది. కానీ తాజాగా మూవీ టీమ్.. ఆదివారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏ‍ర్పాటు చేసింది. వసూళ్లని(Movie Collection) అధికారికంగా ప్రకటించింది.

(ఇదీ చదవండి: స్టార్ హీరోకి ఐదేళ్ల తర్వాత హిట్.. కలెక్షన్ ఎంతొచ్చాయంటే?)

మూడు రోజుల్లో రూ.6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇదే కార్యక్రమంలో మాట్లాడిన నిర్మాత సంపత్ నంది.. విడుదలకు ముందే ఈ చిత్ర బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పుకొచ్చారు. కానీ వసూళ్లు చూస్తుంటే మొత్తానికి మొత్తం రాబడతాయా అనే సందేహం కలుగుతోంది. ఈ వీకెండ్ గడిచిన తర్వాత ఓదెల 2  అసలు సంగతేంటనేది తెలుస్తోంది. వచ్చేవారం పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేకపోవడం ఈ చిత్రానికి ప్లస్ అవ్వొచ్చేమో చూడాలి.

ఓదెల 2 విషయానికొస్తే.. ఓదెలలో తిరుపతి(వశిష్ట సింహ) అనే కామాంధుడు.. కొత్తగా పెళ్లయిన అమ్మాయిల్ని మానభంగం చేస్తుంటాడు. దీంతో తిరుపతి భార్య అతడి తల నరికి జైలుకెళ్తుంది. కానీ తిరుపతి ఆత్మకు శాంతి కలగకుండా ఉండాలని.. సమాధిశిక్ష వేస్తారు. కొన్ని సంఘటనల వల్ల ఇతడి ప్రేతాత్మ తిరిగి ఊరిపై పడుతుంది. దీంతో శివశక్తి అలియాస్ భైరవి (తమన్నా) అనే ఓదెల ఊరికి వస్తుంది. ఆ తర్వాత దుష్టసంహారమే మిగిలిన స్టోరీ.

(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇ‍ప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)