Breaking News

తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?

Published on Sat, 04/19/2025 - 15:18

ఈ వారం థియేటర్లలో తెలుగులో పలు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో తమన్నా 'ఓదెల 2'(Odela 2 Movie) ఒకటి. హారర్ ఫాంటసీగా తీసిన ఈ మూవీని విడుదలకు ముందు బాగానే ప్రమోట్ చేశారు. తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేశారు. కానీ కలెక్షన్సే(Odela 2 Collection) మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా రావట్లేదు. పరిస్థితి ఘోరంగా ఉంది.

రెగ్యులర్ గా రిలీజయ్యే శుక్రవారం కాకుండా గురువారం (ఏ‍ప్రిల్ 17న) ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. కానీ తొలిరోజు చాలాచోట్ల థియేటర్లు సరిగా ఫుల్ కాలేదు. దీంతో రూ.85 లక్షలే వచ్చాయని, రెండో రోజుకి ఇది మరింత తగ్గి రూ.59 లక్షలే వచ్చాయని సమాచారం. మొత్తంగా రూ.1.44 కోట్లు మాత్రమే ఇప్పటివరకు వసూలైనట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌)

దాదాపు రూ.24 కోట్ల మేర బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు ఇంత తక్కువ వసూళ్లు రావడం చూస్తుంటే వీకెండ్ తర్వాత థియేటర్లలో నిలబడుతుందా అనే సందేహం వస్తోంది. మరి లాంగ్ రన్ లో 'ఓదెల 2'కి ఎన్ని కోట్ల వస్తాయనేది చూడాలి?

కథ పరంగా యావరేజ్ టాక్ వచ్చింది. మిక్స్ డ్ రివ్యూలు వచ్చినప్పటికీ ఈ తరహా వసూళ్లు ఎందుకొస్తున్నాయనేది నిర్మాతలకు అర్థం కావట్లేదు. 'అరుంధతి' సినిమాతో పోలిక రావడం ఏమైనా మైనస్ అయిందా అనేది తెలియాల్సి ఉంది. తమన్నా(Tamannaah Bhatia) శివశక్తిగా డిఫరెంట్ గెటప్ వేసినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదా అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: బీభత్సం సృష్టించిన తెలుగు నటుడి కారు)

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)