ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
నవ్విస్తూ భయపెట్టేస్తున్న 'ఓ మై గాడ్' ట్రైలర్
Published on Sat, 06/15/2024 - 21:29
ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓ మంచి ఘోస్ట్'. ఇందులో నందితా శ్వేత, షకలక శంకర్ కీలక పాత్రలు పోషించారు. హారర్, కామెడీ కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకుడు. జూన్ 21న మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ఇది ఎలా ఉందో తెలుసా?
(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?)
ఓ గ్యాంగ్, పిశాచీపురం అనే ఊరిలోకి ఎంటర్ కావడం, అక్కడ ఓ బంగ్లా, అందులోని దెయ్యంతో కామెడీ.. ఇలా ట్రైలర్ చూస్తే ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు భయపెడుతోంది. నందితా శ్వేత దెయ్యం పాత్రలో భయపెడుతుంటే.. వెన్నెల కిషోర్, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు వంటి వారు నవ్వించేశారు. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు.
(ఇదీ చదవండి: 12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్)
Tags : 1