Breaking News

ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సారీ చెప్పు, లేదంటే మా తడాఖా చూపిస్తాం!

Published on Wed, 08/20/2025 - 16:27

 

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) గురించి నీచంగా మాట్లాడతారా? మా ఫ్యాన్స్‌ సత్తా ఏంటో చూపిస్తాం అన్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ స్టేట్‌ కన్వీనర్‌ నరేంద్ర చౌదరి. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నరేంద్ర చౌదరి మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ సభ్యసమాజం తలదించుకునేలా నోటికి ఎంతొస్తే అంత వాగారు. మా ఎన్టీఆర్‌ తల్లిపై దారుణంగా కామెంట్స్‌ చేశారు.

క్షమాపణలు చెప్పాలి
ఎన్టీఆర్‌ తల్లినే కాదు, ఏ స్త్రీ మూర్తి గురించి అలా మాట్లాడకూడదు. అలా ఎవరు మాట్లాడినా తప్పే! ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది ఇంతటితో ఆపేస్తే బెటర్‌. ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనంతపురం నడిబొడ్డున క్షమాపణలు చెప్పాలి. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్‌ అభిమానులందరం ఛలో అనంతపురం అంటూ మీ ఇంటిని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.

ఏం జరిగింది?
వార్ -2 రిలీజ్‌ సమయంలో అభిమానుల స్పెషల్ షోకు  అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో దగ్గుపాటి  ప్రసాద్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌పై రెచ్చిపోయారు. వాడి సినిమాలెలా ఆడనిస్తాను? మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. అంటూ అసభ్య పదజాలంతో హీరో గురించి నీచంగా మాట్లాడారు. ఎన్టీఆర్‌ తల్లిని సైతం దారుణంగా దూషించారు. వార్‌ 2 షోలను అనంతపురంలో నిలిపివేయాలని వార్నింగ్‌ ఇచ్చారు. ఈ వ్యవహారంపై తారక్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

	Jr NTR Fans: సస్పెండ్ చేయకపోతే.. ఎన్టీఆర్ అంటే ఏంటో చూపిస్తాం..

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)