ఓటీటీలో 'దేవర' ఎంట్రీ సమయం వచ్చేసిందా..?

Published on Sun, 11/03/2024 - 17:10

ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్‌ సినిమా దేవ‌ర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యిన‌ట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. దసరా సందర్భంగా సెప్టెంబర్‌ 27న విడుదలైన ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీగా లాభ పడ్డారని నాగవంశీ తెలిపారు.

దాదాపు రూ. 300 కోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కిన దేవ‌ర బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఓటీటీలో కూడా నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు డీల్‌ కుదుర్చుకుంది. థియేట‌ర్ల‌లో రిలీజైన ఆరు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలనే ఓప్పందం దేవర మేకర్స్‌తో ఉన్నట్లు సమాచారం. దీంతో నవంబర్‌ 8న తెలుగుతో పాటు హిందీ,తమిళ్‌,కన్నడ,మలయాళం భాషలలో స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని నిర్ణయించారట. ఈమేరకు బలంగా వార్తలు వస్తున్నాయి.

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మించారు.  ఈ సినిమాలో జాన్వీ కపూర్‌, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి స్టార్స్‌ నటించారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)