Breaking News

పెళ్లి రిసెప్షన్‌లో వాంతులు.. దుల్కర్‌ సల్మాన్‌పై కేసు

Published on Wed, 11/05/2025 - 11:56

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌కు కేరళలోని పతనంతిట్ట జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నోటీసులు జారీ చేసింది.  ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్‌ యజమానిపై కూడా ఫిర్యాదు చేశారు. జిల్లాలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌లో రోజ్ బ్రాండ్ రైస్‌తో చేసిన బిర్యానీ తిన్న వారందరూ ఫుడ్‌ పాయిజనింగ్‌కు గురయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దుల్కర్‌కు నోటీసులు జారీ చేశారు.

నివేదికల ప్రకారం..  2025 డిసెంబర్ 3న కమిషన్ ముందు దుల్కర్ సల్మాన్ హాజరు కావాలని ఆదేశించబడింది. నటుడితో పాటు, రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ మేనేజింగ్ డైరెక్టర్, మలబార్ బిర్యానీ అండ్ స్పైసెస్ జిల్లా మేనేజర్‌ను కూడా హాజరు కావాలని కోరింది.

సంఘటన ఎప్పుడు జరిగింది..?
2025 ఆగస్టు 24న ఈ ఘటన జరిగింది. పతనంతిట్ట జిల్లా వల్లికోడ్‌కు చెందిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ పి.ఎన్. జయరాజన్ చేసిన ఫిర్యాదుతో దుల్కర్‌పై కేసు నమోదు చేశారు. వల్లికోడ్‌లో జరిగిన వివాహ రిసెప్షన్ కోసం బిర్యానీ తయారు చేయడానికి 50 కేజీల రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్‌ను ఆయన కొనుగోలు చేశాడు. ఆ వంటకం తిన్న చాలా మందికి  ఫుడ్ పాయిజనింగ్ కావడం వల్ల వాంతులు చేసుకున్నారని ఆయన ఆరోపించారు.

అయితే, బియ్యం సంచులపై ప్యాకింగ్ తేదీతో పాటు గడువు తేదీ కూడా ముద్రించి లేదని గుర్తించినట్లు చెప్పారు. దీంతో ఆహార ఉత్పత్తి భద్రత చట్టప్రకారం ఆ కంపెనీ లేబులింగ్ ప్రమాణాలను పాటించలేదని జయరాజన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎ.కె. ట్రేడర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మొదటి నిందితుడిగా, మలబార్ బిర్యానీ స్పైస్ పతనంతిట్ట మేనేజర్‌ రెండవ నిందితుడిగా, బ్రాండ్ అంబాసిడర్ దుల్కర్ సల్మాన్ మూడవ నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతానికి, దుల్కర్ సల్మాన్, రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ ప్రతినిధుల నుంచి నోటీసుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)