Breaking News

ఈ ఐటం సాంగ్‌ బ్యూటీ నటిగా సక్సెస్‌ అయ్యేనా?

Published on Fri, 02/06/2026 - 13:43

నోరా ఫతేహి ఐటం సాంగ్‌ స్పెషలిస్ట్‌. దిల్‌బర్‌ సాంగ్‌తో సెన్సేషన్‌ సృష్టించింది. శరీరాన్ని రబ్బర్‌లా సాగదీస్తూ, విల్లులా వంచుతూ స్టెప్పులేయడంలో ఆమె దిట్ట. తన ఎనర్జీకి, అందానికి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. నేడు (ఫిబ్రవరి 6న) ఆమె 34వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

కెరీర్‌
నోరా ఫతేహి కెనడా నటి. కెనడాలోని టోర్నటోలో పుట్టిపెరగడంతోపాటు అక్కడే చదువుకుంది. రోర్‌ (2014) సినిమాతో నటిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ మరుసటి ఏడాది టెంపర్‌ సినిమాలో ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా.. అనే ప్రత్యేక పాటలో అదరగొట్టింది. అక్కడినుంచే తన ఐటం సాంగ్స్‌ జర్నీ మొదలైంది. బాహుబలి మూవీలో 'మనోహరి..' అంటూ ప్రభాస్‌ను చుట్టుముట్టేసే సాంగ్‌తో మరింత ఆదరణ పొందింది.

నటిగా కలిసిరాని అదృష్టం
తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ ఐటం సాంగ్స్‌ చేసింది. అయితే తనకు నటిగా కనిపించాలన్న కోరిక ఎక్కువ. అలా రెండేళ్లుగా ఐటం సాంగ్స్‌పై ఫోకస్‌ తగ్గించేసి యాక్ట్రెస్‌గా సినిమాలు చేస్తోంది. తెలుగులో మట్కా సినిమా చేయగా ఇది అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. ఇక్కడే కాదు హిందీలోనూ తను నటించిన సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో నటిగా బ్రేక్‌ రావడం లేదు. దీంతో మళ్లీ గతేడాది చివర్లో థామా మూవీలో స్పెషల్‌ సాంగ్‌లో కాలు కదిపింది. 

బిగ్‌బాస్‌ షోలోనూ..
నోరా డ్యాన్సర్‌, నటి మాత్రమే కాదు, సింగర్‌ కూడా! ప్రస్తుతం నోరా ఫతేహి.. కన్నడలో కేడీ: ద డెవిల్‌, తమిళంలో కాంచన 4 సినిమాలు చేస్తోంది. మరి వీటితోనైనా బ్రేక్‌ వస్తుందేమో చూడాలి! నోరా ఫతేహి.. హిందీ బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లోనూ పార్టిసిపేట్‌ చేసింది. డ్యాన్స్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ జలక్‌ దిక్‌లాజా 9వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇదే షోకి జడ్జిగా వ్యవహరించడం విశేషం.

 

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)