Breaking News

నటుడి జుట్టు పట్టుకుని లాగి చెంప చెళ్లుమనిపించిన హీరోయిన్‌

Published on Wed, 03/01/2023 - 17:00

సినిమాల్లోనే కాదు కొన్నిసార్లు సినిమా సెట్స్‌లో కూడా ఘర్షణలు జరుగుతుంటాయి. అవి మితిమీరిపోతేనే ఎక్కడలేని తలనొప్పులు వస్తాయి. హీరోయిన్‌, డ్యాన్సింగ్‌ క్వీన్‌ నోరా ఫతేహి తన తొలి సినిమా షూటింగ్‌లోనే గొడవపడిందట. రోర్‌: టైగర్స్‌ ఆఫ్‌ ది సుందర్బన్స్‌ చిత్రంతో 2014లో వెండితెరపై అడుగుపెట్టింది నోరా. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన ఓ చేదు ఘటనను గతంలో ఓ షోలో వెల్లడించగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

నోరా మాట్లాడుతూ.. 'బంగ్లాదేశ్‌లోని సుందర్బన్స్‌ అడవుల్లో రోర్‌ షూటింగ్‌ జరుగుతోంది.  సంస్కారం లేని ఓ నటుడు నాతో అనుచితంగా ప్రవర్తించాడు. నాకు కోపమొచ్చి వెంటనే అతడి చెంప పగలగొట్టాను. దీంతో అతడు కూడా తిరిగి నన్ను కొట్టాడు. నేను మళ్లీ తిరిగి కొట్టాను. అతడు నా జుట్టు పట్టుకుని లాగాడు, నేను కూడా అతడి జుట్టు లాగాను. అందరూ చూస్తుండగానే మేమిద్దరం గట్టిగట్టిగా కొట్టేసుకున్నాం. వెంటనే డైరెక్టర్‌ జోక్యం చేసుకుని మమ్మల్ని ఆపాడు' అని చెప్పుకొచ్చింది.

ఆమె చెప్పింది విని అక్కడున్న అర్చన పూరన్‌ సింగ్‌, కపిల్‌, ఆయుష్మాన్‌ అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. కానీ నోరా మాత్రం ఆ సంఘటన గురించి చెప్తున్నంత సేపు పడీపడీ నవ్వుతూనే ఉంది. ఇది నెటిజన్లకు అస్సలు మింగుడుపడలేదు. నువ్వేమైనా జోక్‌ చెప్తున్నావా? ఎందుకంత నవ్వుతున్నావు? ఇదేదో కామెడీ అనుకుంటుందా? ఏంటీ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల కపిల్‌ శర్మ షోలో మరోసారి తళుక్కుమంది నోరా.

అప్పుడు కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. డేట్స్‌కు వెళ్లినప్పుడు తాను బిల్లు కట్టనని చెప్పింది. ఇప్పుడు లోకం మారిందని, అమ్మాయిలు కూడా బిల్లు కడుతున్నారని అర్చన చెప్పగా.. అయితే నువ్వు కట్టుకో, కానీ నేను మాత్రం కట్టనంటూ దురుసుగా మాట్లాడింది. ఇకపోతే నోరా విషయానికి వస్తే.. టెంపర్‌, బాహుబలి: ది బిగినింగ్‌, కిక్‌ 2, ఊపిరి, లోఫర్‌ సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో ఓ ఊపు ఊపింది. దిల్‌బర్‌ పాట గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆమె జాన్‌ అబ్రహం, షెహనాజ్‌ గిల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 100% చిత్రంలో నటిస్తోంది.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)