Breaking News

నేను కాదు...సరస్వతి కనిపిస్తుంది: నివేదా థామస్‌

Published on Sun, 09/01/2024 - 01:10

‘‘సింపుల్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ స్టోరీతో రూపొందిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. ఈ సినిమాలో తల్లి పాత్ర చేయడానికి ఆలోచించలేదు. ఓ నటిగా అన్ని పాత్రలూ చేయాలి. ఈ మూవీలో నివేదా థామస్‌ కాకుండా నేను చేసిన సరస్వతి పాత్రే కనిపిస్తుంది’’ అని హీరోయిన్‌ నివేదా థామస్‌ అన్నారు. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. 

నంద కిశోర్‌ ఈమాని దర్శకత్వంలో రానా, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నివేదా థామస్‌ మాట్లాడుతూ– ‘‘నంద కిశోర్‌ ‘35–చిన్న కథ కాదు’ కథని అద్భుతంగా రాశారు. విద్యా వ్యవస్థ గురించి గొప్పగా, భార్యాభర్త, పిల్లలు, టీచర్, స్టూడెంట్స్‌... ఇలాంటి బంధాల గురించి అందంగా చెప్పారు. ఈ సినిమా చూస్తున్నంత సేపూ కె. విశ్వనాథ్‌గారి సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామిని కూడా ఓ పాత్రలా చూపించారు దర్శకుడు’’ అన్నారు.  

హేమాలాంటి కమిటీలు రావాలి: ‘‘మలయాళ చిత్ర పరిశ్రమలో ఉండటాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను. ‘అమ్మ’లో నేను ఓ సభ్యురాలిని. హేమా కమిటీ నివేదికలో వెలుగు చూసిన అంశాలు బాధాకరం. ఆ విషయాల గురించి నేను నా కుటుంబ సభ్యులతో కూడా చర్చించాను. ఈ విషయంలో డబ్ల్యూసీసీ (ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌)ని ప్రశంసించాలి. పని చేసే చోట మహిళలకు భద్రత కల్పించడం కనీస అవసరం. దీని గురించి నేనూ వినతి చేశాను. మలయాళ చిత్ర పరిశ్రమలోలాగే ఇతర ఇండస్ట్రీల్లోనూ హేమా లాంటి కమిటీలు వస్తే మంచిదే’’ అన్నారు నివేదా థామస్‌.

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)