Breaking News

చూసేందుకు సాధారణంగానే..!

Published on Wed, 08/21/2024 - 12:49

కాస్త పొగరుబోతు నటిగా ముద్ర వేసుకున్న నటి నిత్యామీనన్‌. అది ఈమెలోని నటనా ప్రతిభ నుంచి వచ్చింది కావచ్చు. ఈమెను పొట్టి, బొద్దు అమ్మాయి అని కూడా అంటారు. అయితే వాటిని అస్సలు పట్టించుకోదు. అందుకే ఈ మలయాళ భామ తెలుగు, తమిళం భాషల్లోనూ కథానాయకిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. తిరుచ్చిట్రఫలం అనే తమిళ చిత్రంలోని నటనకుగానూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ అవార్డుల పట్టికలో ఉత్తమ నటి అవార్డుకు నిత్యామీనన్‌ పేరు చోటుచేసుకుంది. 

ఈ సందర్భంగా ఆమె తన ఎక్స్‌ మీడియాలో పేర్కొంటూ ‘‘చాలా సంతోషంగా ఉంది. ఇది నేను గెలుచుకున్న తొలి జాతీయ అవార్డు. చూడడానికి సాధారణంగా ఉన్నా, నటన వెనుక ఉన్న శ్రమ సాధారణం కాదని అర్థం చేసుకున్న జాతీయ అవార్డుల కమిటీకి ధన్యవాదాలు. ఉత్తమ నటన అనేది బరువు తగ్గడమో, పెరగడమో, సహజ సిద్ధమైన శరీరాకృతిని మార్చుకోవడంలోనే ఉండదు. అవంతా నటనలో ఒక భాగం మాత్రమే కానీ అవే నటన కాదు. దీన్ని నిరూపించడానికే నేను ప్రయతి్నస్తున్నాను. ఈ అవార్డు నాకు, దర్శకుడు భారతీరాజా, ప్రకాశ్‌రాజ్,ధను‹Ùకు చెందుతుంది. 

ఎందుకంటే ఒక చిత్రంలో నటుడికి సరిసమానంగా నటికీ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నేను ఇంతకు ముందెప్పుడూ నటించలేదు. అది తిరుచ్చిట్రంఫలం చిత్రంలో జరిగింది. మరో విషయం ఏమిటంటే  నిజాల కంటే వదంతులు అధికంగా ప్రచారం అవుతుంటాయి. ఒక రంగంలో ఎదగడం చాలా కష్టం’’ అని నిత్యామీనన్‌ పేర్కొన్నారు. కాగా తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డును ప్రకటించిన విషయం ముందుగా  ధనుష్‌ ఫోన్‌ చేసి చెప్పారన్నారు. ఆయన ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పడంతో విషయం ఏమిటని అడిగానన్నారు. అప్పుడు ఆయన ఈ అవార్డు గురించి వివరించారని నిత్యామీనన్‌ చెప్పారు.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు