Breaking News

నిత్యా మీనన్‌ కొత్త సినిమా.. పలువురికి ఆదర్శంగా నిలిచిన నటి!

Published on Tue, 06/09/2026 - 10:11

దక్షిణాది నటీమణుల్లో నటి నిత్యామీనన్‌ ప్రత్యేకమనే చెప్పాలి. చాలా ముక్కుసూటి మనిషి. మనసులో అనిపించింది చెప్పే భామ. పాత్రల్లో జీవించే నటీమణి. కాస్త బొద్దుగా ఉన్నా, దాన్నే అలంకారంగా భావించే బ్యూటీ. కథా పాత్రలు నచ్చితేనే నటించడానికి అంగీకరించే నటి. విమర్శలను అస్సలు పట్టించుకోని సంచలన నటి.  సెలెక్టీవ్‌ చేసే నిత్యామీనన్‌ ఇటీవల తమిళంలో నటించిన తలైవన్‌ తలైవి చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత మరో చిత్రం కమిట్‌ కానీ ఈమెను తాజాగా ఒక కథ తెగ నచ్చేసిందట. 

దీంతో ఆ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపేసినట్లు తాజా సమాచారం. అవును ఇంతకు ముందు యామిరుక్క భయమే, కాట్టేరి, కవల్‌ వేండామ్‌ వంటి చిత్రాలను తెరకెక్కించిన డీకే తాజాగా తన కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉమెన్‌ సెంట్రిక్‌ కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటి నిత్యామీనన్‌ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈమెకు దర్శకుడు కథ చెప్పగానే తెగ నచ్చేసిందనీ దీంతో ఆమె వెంటనే నటించడానికి అంగీకరించినట్లు సమాచారం.

విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో నటించడానికి చిన్న మొత్తాన్నే అడ్వాన్స్‌గా తీసుకున్నారని, మిగిలింది చిత్రానికి వచ్చే లాభాల్లో షేర్‌ను తీసుకోవడానికి  నిత్యామీనన్‌ అంగీకరించినట్లు  సమాచారం. చాలాకాలంగా నిర్మాతలు కోరుకుంటోంది ఇదే కావడంతో.. ఈ విషయంలో పలువురికి నిత్య మీనన్‌ మార్గదర్శిగా నిలుస్తారని చెప్పవచ్చు. కాగా ఈమె నటించనున్న తాజా చిత్రానికి సంబంధించి న పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా, వెల్లడించే అయ్యే అవకాశం ఉంది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)