Breaking News

నెల రోజుల్లోపే ఓటీటీకి సంక్రాంతి చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Thu, 02/06/2025 - 16:06

కోలీవుడ్ స్టార్‌ జయం రవి, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం కాదలిక్కా నేరమిల్లై(Kadhalikka Neramillai). ఈ సినిమాను  కృతిక ఉదయనిధి తెరకెక్కించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. కోలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తాజాగా ఓటీటీకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది.

పొంగల్  కానుకగా థియేటర్లలో ఫ్యాన్స్‌ను అలరించిన కాదలిక్కా నేరమిల్లై ఈ నెల 11 నుంచే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీ ప్రియులను అలరించనుంది కాదలిక్కా నేరమిల్లై మూవీ.

(ఇది చదవండి: వారికేమో ముద్దులు, హగ్గులు.. అభిమానితో అలాగేనా?.. హీరోయిన్‌పై నెటిజన్స్‌ ఫైర్!)

కాగా.. ఈ చిత్రానికి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆయన సతీమణి కృతిక ఉదయనిధి దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా ఆమెకు ఇది మూడో సినిమా కావడం మరో విశేషం. ఈ చిత్రంలో జయం రవి, నిత్యతో పాటు యోగి బాబు, వినయ్, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని, గాయకుడు మనో, టీజే బాను, జాన్ కోగన్ ప్రధాన పాత్రలు పోషించారు. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రఘుమాన్ సంగీతం అందించారు.

తెలుగులో నిత్యా మీనన్ కెరీర్..

అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్‌. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్‌, జబర్దస్త్‌, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్‌ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్‌, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్‌ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్‌, డియర్‌ ఎక్సెస్‌ సహా మరో సినిమా చేస్తోంది.
 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)