Breaking News

'జయం' సినిమాలో హీరోయిన్‌ రష్మీ గౌతమ్‌.. చివర్లో: నితిన్‌

Published on Mon, 03/31/2025 - 11:01

ఫస్ట్‌ సినిమాతోనే సూపర్‌ హిట్‌ కొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు నితిన్‌ (Nithiin). ఇతడు హీరోగా నటించిన తొలి చిత్రం జయం (Jayam Movie). తేజ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ మూవీలో గోపీచంద్‌ విలన్‌గా నటించాడు. సదా హీరోయిన్‌గా పరిచమైంది. అయితే ఈ సినిమాలో మొదట సదాని కథానాయికగా అనుకోలేదట!

రష్మీతోనే రిహార్సల్స్‌ చేశా..
హీరో నితిన్‌ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఉగాది ఈవెంట్‌కు హాజరైన అతడు జయం సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. జయం సినిమాకు రష్మీ గౌతమ్‌ (Rashmi Gautam)తో కలిసి రిహార్సల్స్‌ చేసినట్లు తెలిపాడు. దాదాపు 90 శాతం సీన్లు రష్మీతో రిహార్సల్స్‌ చేశానని, చివర్లో ఏమైందో ఏమో కానీ హీరోయిన్‌ను మార్చేశారు అని పేర్కొన్నాడు.

బుల్లితెరపై సెటిలైన రష్మీ
ఒకవేళ రష్మీ గనక హీరోయిన్‌గా జయం సినిమా చేసుంటే అప్పట్లోనే స్టార్‌ అయిపోయేది. పేరుప్రఖ్యాతలతో పాటు మంచి అవకాశాలు వచ్చేవి. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో బోల్డ్‌ సినిమాల్లోనూ యాక్ట్‌ చేసింది. కానీ అవేవీ వర్కవుట్‌ కాకపోవడంతో బుల్లితెరపై సెటిల్‌ అయింది. గతంలో యువ సీరియల్‌లో నటించిన ఆమె ప్రస్తుతం కామెడీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.

సినిమా
నితిన్‌ హీరోగా నటించిన లేటెస్ట​ మూవీ రాబిన్‌హుడ్‌. శ్రీలీల కథానాయిక. వెన్నెల కిశోర్‌, రాజేంద్రప్రసాద్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అతిథి పాత్రలో కనిపించాడు. మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చదవండి: పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)