Breaking News

కోలీవుడ్‌లో నటి రీఎంట్రీ, రజనీకాంత్‌కు భార్యగా..

Published on Sun, 06/25/2023 - 06:37

లాల్‌సలాం చిత్రంలో రేర్‌ కాంబినేషన్‌న్స్‌ సెట్‌ చేస్తున్నారని చెప్పవచ్చు. రజనీకాంత్‌ పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న చిత్రం లాల్‌సలాం. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటిస్తున్నారు. రజనీకాంత్‌ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రజనీకాంత్‌ మొయ్దీన్‌భాయ్‌ అనే ముస్లిం పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నటి జీవిత చాలాకాలం తర్వాత తమిళంలోకి రీఎంట్రీ అవుతున్నారు.

ఈమె ఈ చిత్రంలో రజనీకాంత్‌ చెల్లెలిగా నటిస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్‌ది అతిథి పాత్ర కావడంతో ఆయనకు జోడీ ఉంటుందా? లేదా? అనే సందేహం చాలా మందికి ఉంటూ వచ్చింది. దీనికి సంబంధించిన హాట్‌ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. 1980 ప్రాంతంలో యువ కథానాయకిగా వెలిగిన నిరోషా దివంగత ప్రఖ్యాత నటుడు ఎమ్మార్‌ రాధా కూతురు, నటి రాధిక సోదరి అయిన ఈమె అప్పట్లో నటుడు కమల్‌ హాసన్‌, విజయ్‌కాంత్‌, ప్రభు, కార్తీక్‌ వంటి కథానాయకుల సరసన నటించారు.

అదేవిధంగా తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. అలాంటిది చాలాకాలం తర్వాత లాల్‌ సలాం చిత్రంలో రజనీకాంత్‌కు భార్యగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే చాలావరకు పూర్తిచేసుకుంది. కాగా త్వరలో రజనీకాంత్‌, నిరోషాలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్‌ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

చదవండి: రేంజ్‌ రోవర్‌ కారు కొన్న సూపర్‌ స్టార్‌.. ఐదున్నర కోట్లపైమాటే

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)