Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా
Breaking News
నీలకంఠ విజయం సాధించాలి: ఆది సాయికుమార్
Published on Fri, 01/02/2026 - 03:18
‘‘నేను, మహేంద్రన్ చెన్నైలో పాండియన్ మాస్టర్ దగ్గర ఫైట్స్ నేర్చుకున్నాం. తను మంచి యాక్టర్. ‘నీలకంఠ’ సినిమా తనకు, యూనిట్‌కి పేరు తీసుకురావాలి. ఈ చిత్రానికి ప్రేక్షకులు మంచి విజయం అందించాలి’’ అని హీరో ఆది సాయికుమార్ కోరారు.
మహేంద్రన్ హీరోగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్లుగా రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నీలకంఠ’. ఎం.మమత, ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హీరోలు ఆది సాయికుమార్, ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ–‘‘నీలకంఠ’ మహేంద్రన్‌కి, టీమ్‌కి మంచి సక్సెస్ ఇవ్వాలి’’ అని చెప్పారు. ‘‘నీలకంఠ’ ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది’’ అని మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి, రాకేష్ మాధవన్, మహేంద్రన్, యష్న ముతులూరి’’ పేర్కొన్నారు.
Tags : 1