అమెరికా నష్టపరిహారం చెల్లించాల్సిందే.. మీ ఇష్టం మళ్లీ యుద్ధమే!
Breaking News
అదే నిజమైన విజయం: నిహారిక
Published on Sat, 04/11/2026 - 10:59
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాకాస’. జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ‘రాకాస’ వసూళ్ల పరంగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ‘రాకాస’ యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించగా, బ్రహ్మాజీ, మైత్రీ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మైత్రీ రవి మాట్లాడుతూ– ‘‘నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇప్పుడు ‘రాకాస’తోనూ మంచి హిట్ సాధించాం. భవిష్యత్‌లో ఆమె చేసే సినిమాలన్నింటినీ మేమే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ‘‘డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ అంటే సినిమా హిట్ అయినట్లే. ‘రాకాస’ చిత్రాన్ని నమ్మి, తీసుకున్న ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కు ‘థ్యాంక్స్’ అని చెప్పారు సంగీత్ శోభన్.
‘‘మా డిస్ట్రిబ్యూటర్లందరూ సంతోషంగా ఉన్నారంటే అదే నిజమైన విజయం అని నాకు అనిపిస్తోంది. నేను చేసే ప్రతీ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను. ఈ వేసవిలో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ‘రాకాస’ చిత్రాన్ని రూపొందించాం. ఫ్యామిలీ ఆడియన్స్ మా చిత్రాన్ని ఆదరిస్తున్నారు’’ అని చెప్పారు నిహారిక. ‘‘నా డ్రీమ్‌ని, నా కథను ఇంత వరకు తీసుకుని వచ్చిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌కు థ్యాంక్స్’’ అని చెప్పారు మానస. పంపిణీదారులు సన్నీ, భాస్కర్, రమేశ్ యాదవ్, పాండు, సుబ్బారెడ్డి తదితరులు మాట్లాడారు.
Tags : 1