Breaking News

ఒక్క పోస్ట్‌తో వారికి ఇచ్చిపడేసిన నిహారిక కొణిదెల!

Published on Mon, 09/18/2023 - 16:29

సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలంటే జనాలకు చాలా ఇష్టం. వారి పర్సనల్‌ లైఫ్‌పై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. పెళ్లి చేసుకున్నప్పుడు చప్పట్లు కొట్టడం, విడాకులు తీసుకున్నప్పుడు నోటికొచ్చింది తిట్టేయడం నెటిజన్లకు అలవాటైపోయింది. అటుపక్కన ఉన్నవారు ఎంత బాధపడతారనే విషయం కూడా ఆలోచించడం లేదు. కొందరైతే హద్దులు మీరి మరీ సోషల్‌ మీడియాలో అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇటీవలి కాలంలో విడాకుల వల్ల ట్రోలింగ్‌కు గురైనవారిలో నిహారిక కొణిదెల ఒకరు.

తొలుత ఆమె చైతన్యతో విడిపోయినట్లు రూమర్స్‌ వచ్చాయి. ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. తర్వాత ఓ సమయం చూసుకుని ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు,  విడాకులు తీసుకున్నారు. అయితే నిహారిక విడాకులకు ఆమె వ్యవహార శైలే కారణమని కొందరు లేనిపోని పుకార్లు సృష్టించారు. తనకున్న పబ్‌ అలవాట్ల వల్లే చైతన్య దూరం పెట్టాడని ఏదేదో రాసేశారు. అంతేకాదు, తనకు యూట్యూబర్‌ నిఖిల్‌కు లింక్‌ పెడుతూ వాళ్లను విమర్శించారు. తాజాగా ఆ వార్తలకు పరోక్షంగా ఘాటుగా సమాధానమిచ్చింది నిహారిక. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో నిఖిల్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పింది.

'యాంకరింగ్‌ నుంచి సహనటుడిగా మారావు. అక్కడి నుంచి నిర్మాతగా.. తర్వాత నా చిట్టి తమ్ముడిగా మారావు. మనం కలిసి చాలాదూరం ప్రయాణించాం. స్వచ్ఛమైన మనసు ఉన్నవాళ్లు కొందరే ఉంటారు. అందులో నువ్వు ఒకడివి. లవ్‌ యూ నిక్కు. గ్రేట్‌ బర్త్‌డే నానా..' అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. దీనికి నిఖిల్‌ థాంక్యూ నిహా అని రిప్లై ఇచ్చాడు. నిఖిల్‌ తనకు తమ్ముడిలాంటివాడని పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేసింది నిహారిక.

చదవండి: రెండు వారాలకు షకీల ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)