Breaking News

నా జీవితంలో అది ఎప్పటికీ ప్రత్యేకమే: నిహారిక

Published on Sat, 08/12/2023 - 15:28

మెగాడాటర్, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. మెగా కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ టచ్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా నెటిజన్స్‌తో సరదాగా చిట్ చాట్‌ నిర్వహించారు. ఈ ఇంటరాక్షన్‌లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. అసలు ఆమెను ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఓ లుక్కేద్దాం పదండి. 

(ఇది చదవండి: ‘భోళా శంకర్‌’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్‌.. ఎన్ని కోట్లంటే.. )

నిహారిక తన ఫ్యాన్స్‌తో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆమె ఇష్టమైన విషయాల గురించి  మాట్లాడారు. మీకిష్టమైన ప్రదేశం, వెబ్ సిరీస్‌లు ఏవని అడగ్గా.. ఇండోనేషియాలోని బాలి తన బెస్ట్ వెకేషన్‌ ప్లేస్ అని వెల్లడించింది. ఇక వెబ్ సిరీస్‌లు విషయానికొస్తే దిస్ ఇజ్ అజ్, డెక్ట్సర్ అని తెలిపింది. మరో నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేయగా.. నిహారిక బదులిచ్చింది. వరుణ్‌తేజ్‌తో దిగిన ఏ ఫోటో మీకు ఇష్టమని ప్రశ్నించగా.. ఎంగేజ్‌మెంట్‌లో అన్నయ్యతో దిగిన ఫోటోనే నా జీవితంలో అత్యంత ప్రత్యేక సందర్భమని తెలిపింది. అంతే కాకుండా నాకు బోర్డ్ గేమ్స్ అంటే చాలా ఇష్టమని.. రొమాన్స్‌, మర్డర్‌ మిస్టరీ జోనర్ సినిమాలంటే తనకు ఆసక్తి అని వెల్లడించింది. కాగా.. ఇటీవలే తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి:  'జైలర్‌' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్‌తో ధనుష్‌ రచ్చ)


 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు