Breaking News

సూపర్ హిట్ కాంబో.. ఆ డైరెక్టర్‌తో మరోసారి నిహారిక!

Published on Wed, 10/08/2025 - 21:24

గ‌తేడాది చిన్న చిత్రంగా వచ్చిన సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. ఈ మూవీని మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి య‌దు వంశీ దర్శకత్వం వహించారు.  రూ.9 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట్రిక‌ల్‌గా రూ.24.5 కోట్లు వ‌సూళ్ల‌ు రాబట్టింది.

మరోసారి రిపీట్.. 

‍అయితే మరోసారి ఈ కాంబో రిపీట్ కానుందని తెలుస్తోంది. యంగ్ డైరెక్ట‌ర్ య‌దు వంశీ మ‌రోసారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెలతో క‌లిసి మ‌రో సినిమాను రూపొందించ‌టానికి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ సినిమా 2026లో సెట్స్ పైకి వెళ్ల‌నుందని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఇక కమిటీ కుర్రోళ్లు సినిమా అవార్డుల రేసులో స‌త్తా చాటింది. సైమా 2025లోబెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా సందీప్ సరోజ్‌కి సైమా అవార్డు వచ్చింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెల్చుకుంది. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. అలాగే డైరెక్టర్ యదు వంశీ ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌గా అవార్డును సొంతం చేసుకున్నారు.

ప్రొడక్షన్ నెం.2..

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను మానస శర్మ, మహేష్ ఉప్పాల అందించారు. ఫాంటసీ, కామెడీ జోనర్ తెరెకెక్కనున్న ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)