Breaking News

అప్పటి నుంచి మా నాన్న డబ్బులు తీసుకోవట్లేదు : నిహారిక

Published on Mon, 03/02/2026 - 09:33

మెగా డాటర్‌ నిహారిక నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ అనే బ్యానర్‌ని స్థాపించి, 2024లో ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమాను నిర్మించారు. తొలి  సినిమానే సూపర్‌ హిట్‌ అయింది. భారీ కలెక్షన్స్‌తో పాటు బోలెడు అవార్డులను తెచ్చిపెట్టింది. కాస్త గ్యాప్‌ తీసుకొని రెండో చిత్రంగా ‘రాకాస’ అనే హారర్‌ కామెడీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సినిమా టీజర్‌ని ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. తన సినీ జర్నీ గురించి నిహారిక ఆసక్తికర విషయాలను పంచుకుంది. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోకుండానే చిత్రాలను నిర్మిస్తున్నానని నిహారిక చెప్పింది.

‘నేను యాంకర్‌గా 2015లో ఢీ జూనియర్‌ షో చేశా. అప్పుడు నాకు 20 ఏళ్లు. అప్పటి నుంచే మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం ఆపేశా. తండ్రిగా ఆయన నాకు అప్పుడప్పుడు పాకెట్‌ మనీ ఇస్తాడు. అది ఆయనకు నాపై ఉన్న ప్రేమ మాత్రమే. అందుకే తీసుకుంటాను. అంతేకాని సినిమాలను నిర్మించేంత డబ్బులను మా నాన్న నుంచి తీసుకోలేదు’ అని నిహారిక చెప్పుకొచ్చింది.

సొంత బ్యానర్‌లో ఎందుకు నటించడం లేదని ఓ రిపోర్టర్‌ ప్రశ్నించగా.. ‘నాకు ఎవరైనా కథ చెప్పడానికి వచ్చినప్పుడు.. నేనే నటించాలి అనే కండీషన్‌ పెట్టను. ముందు కథ వింటాను. దానికి సెట్‌ అయ్యే నటీనటులను మాత్రమే తీసుకుంటాం.అంతేకానీ.. ఈ సినిమాలో నన్నే హీరోయిన్‌గా పెట్టుకోవాలని అని కండీషన్‌ పెట్టను. ఒకవేళ వాళ్లు చెప్పే కథకు నేనే సెట్‌ అవుతాను అనుకుంటే కచ్చితంగా నటిస్తాను. ఇప్పటి వరకు మాత్రం నా దగ్గరకు అలాంటి కథలు రాలేదు. అందుకే నటించలేదు’ అని నిహారిక చెప్పుకొచ్చింది.

ఇక సినిమాల్లోకి వస్తానంటే ఇంట్లోవాళ్ల రియాక్షన్‌ ఏంటి అని మరో రిపోర్టర్‌ అడగగా.. ‘నేను ముందుగా డాక్టర్‌ అవుదాం అనుకున్నా. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే..వద్దని చెప్పారు. అందులో ఉండే మంచి, చెడులను వివరించారు. మా బంధువులలో కొంతమంది డాక్టర్లు ఉన్నారు. వాళ్లు కూడా ‘వద్దు..కష్టంగా ఉంటుంది’ అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాల్లోకి వస్తానని చెప్పా. అప్పుడు కూడా ఇంట్లోవాళ్లు.. ఇండస్ట్రీలో ఉండే మంచి, చెడులను వివరించారు. ఆ తర్వాత నీ ఇష్టం అని మాత్రమే చెప్పారు. డాక్టర్‌ కంటే యాక్టర్‌ అవ్వడమే కాస్త ఈజీ అనిపించింది. అందుకే సినిమాల్లోకి వచ్చేశా’ అని నిహారిక చెప్పుకొచ్చింది. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు