Breaking News

మూడేళ్ల కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది

Published on Thu, 01/15/2026 - 05:19

‘‘ది రాజా సాబ్‌’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో సంతోషంగా ఉన్నాను. ఈ సినిమా కోసం యూనిట్‌ అంతా మూడేళ్లు కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు ఇచ్చారని భావిస్తున్నాం. ఈ సినిమాలో నన్‌గా నేను చేసిన బెస్సీ రోల్‌ కోసం చాలా ప్రిపేర్‌ అయ్యాను’’ అని నిధీ అగర్వాల్‌ తెలిపారు. ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘ది రాజా సాబ్‌’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. 

టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల అయింది. ఈ నేపథ్యంలో నిధీ అగర్వాల్‌ మాట్లాడుతూ– ‘‘ది రాజా సాబ్‌’లో తాంత్రిక విద్యలు, సైకలాజికల్‌ గేమ్స్‌ ఆడే ఓ దుష్టశక్తిని దైవికంగా ఎదుర్కోవడాన్ని కొత్తగా చూపించారు మారుతిగారు. ప్రభాస్‌గారు తానో బిగ్గెస్ట్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అనుకోరు. మా అందరితో సరదాగా కలిసిపోయేవారు. విజువల్‌ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, ప్రొడక్షన్‌ క్వాలిటీ విషయంలో విశ్వప్రసాద్‌గారు రాజీ పడలేదు.

 ‘హరి హర వీరమల్లు’ సినిమాతో పాటు ‘ది రాజా సాబ్‌’ సినిమా షూటింగ్‌ ఒకే సమయంలో చేశాను. ఈ సినిమాల షూటింగ్స్, ప్రయాణం వల్ల నిద్ర కూడా ఉండేది కాదు. ఆ టైమ్‌లో ‘రాజా సాబ్‌’ మేకర్స్‌ సెట్‌లో నన్ను బాగా చూసుకునేవారు. అందుకే నేనంటే సెట్‌లో అందరికీ ఇష్టమని ప్రభాస్‌గారు చెప్పారు. ఈ సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా ఆదరణ పొందాలని కోరుకున్నాను. ఎందుకంటే... మేమంతా ఒకే పడవలో వెళ్తున్నాం. ప్రమాదం జరగాలని చూస్తే అందరం మునిగిపోతాం. ప్రస్తుతం తెలుగులో మూడు, హిందీలో రెండు సినిమాల్లో నటిస్తున్నాను. తెలుగులో బిజీగా ఉండటం వల్ల హైదరాబాద్‌లో ఇల్లు తీసుకున్నాను’’ అని పేర్కొన్నారు.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)