Breaking News

తెలుగు సినిమాకు ఆస్కార్‌ రావడం గర్వంగా ఉంది: తమ్మారెడ్డి

Published on Mon, 03/13/2023 - 15:36

టాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ రూ.80 కోట్లు ఖర్చు చేసిందని, ఆ డబ్బు తమకిస్తే 8 సినిమాలు తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.  తెలుగు సినిమా గురించి ప్రపంచమంతా మాట్లాడుతుంటే తెలుగువాళ్లై ఉండి ఇలాంటి కామెంట్స్‌ చేయడం ఏంటని తమ్మారెడ్డిపై పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాట ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. హాలీవుడ్‌ పాటలను తలదన్ని నాటునాటు విజయకేతనం ఎగరవేసింది.  తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి యావత్‌  సినీ, రాజకీయ ప్రముఖులు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ స్పందన కోసం నెటిజన్లు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. తాజాగా నాటునాటు పాటకు ఆస్కార్‌ రావడంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. 'మన తెలుగు పాటకు ఆస్కార్‌ రావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నాకే కాదు, ప్రతి భారతీయుడు, సినిమాను ప్రేమించే వాళ్లకు  ఇది గర్వకారణం.  తెలుగు సంగీతాన్ని, తెలుగుదనాన్ని ఇప్పటికీ తమ సినిమాల్లో పొందుపరుస్తున్న అతికొద్దిమందిలో కీరవాణి, చంద్రబోస్‌ ఒకరు. వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన నాటునాటు పాటకు ఆస్కార్‌ రావడం చాలా అద్భుతమైన విషయం. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకి నా అభినందలు తెలియజేస్తున్నాను' అంటూ తమ్మారెడ్డి పేర్కొన్నారు. 



 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)