Breaking News

పవన్‌ కల్యాణ్‌కు జ్వరమా? ఇది నిజమా?

Published on Wed, 06/28/2023 - 17:57

పవన్‌ కల్యాణ్‌కు జ్వరం వచ్చింది. ఏకంగా 102 డిగ్రీల టెంపరేచర్‌ ఉంది.. అందుకే బస్సు యాత్ర వాయిదా.. ఇదీ నిన్నటి నుంచి జనసేన నాయకులు చేస్తోన్న ప్రచారం. పార్టీ కార్యకర్తలు కూడా ఇదే నమ్మారు. నిజంగానే తమ నాయకుడు అస్వస్థతకు గురయ్యారని, త్వరగా కోలుకొని బస్సుయాత్రకు రావాలని కోరుకున్నారు. కానీ తాజాగా ఓ ఫోటో చూసి మాత్రం అంతా బిత్తరపోయారు. ఇదే జ్వరమా? ఆ సాకుతో ఆడుతున్న పొలిటికల్‌ డ్రామానా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

కొద్దిరోజులుగా వారాహి వాహనంలో యాత్ర చేస్తోన్న పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకు గురయినట్టు జనసేన నేతలు చెప్పుకొచ్చారు. మంగళవారం నుంచి ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, దీంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని ప్రకటించారు. ఆ కారణంగానే రెండు రోజుల పాటు బస్సు యాత్రకు బ్రేక్‌ ఇచ్చి  భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్‌ హాల్‌ లో పవన్‌ విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలిపారు.

కట్‌ చేస్తే.. హుషారుగా సినిమాకు డబ్బింగ్‌ చెప్తూ కనిపించాడు పవన్‌ కల్యాణ్‌. భీమవరంలోని పార్టీ కార్యాలయంలోనే  తాను నటించిన తాజా చిత్రం ‘బ్రో’ టీజర్‌ డబ్బింగ్‌ చెప్పాడు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సముద్రఖని తెలియజేస్తూ ట్వీట్‌ చేయడంలో ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

జ్వరం సాకుతో పవన్ కల్యాణ్ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాడని పలువురు విమర్శిస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ చేయలేక సాకులు చెప్తున్నారని కామెంట్‌ చేస్తున్నారు. డబ్బింగ్‌ కోసమే బస్సు యాత్రకు బ్రేక్‌ ఇచ్చాడని, ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పలేక జ్వరమంటూ పవన్‌ డ్రామాలాడుతున్నారని కొంతమంది నెటిజన్స్‌ విమర్శిస్తున్నారు.

పవన్‌ డబ్బింగ్‌ చెబుతున్న ఫోటోలను షేర్‌ చేస్తూ ‘ఆరోగ్యం బాలేదు అని సైనిక్స్ కి చెప్పి బ్రో మూవీ కి సముద్రఖని తో కలిసి డబ్బింగ్ పూర్తి చేస్తున్న కళ్యాణ్ బాబు..ఇదీ రాజకీయాల్లో ఇతని సంకల్పం’ అని ఓ నెటిజన్‌ రాసుకొచ్చాడు. ఈ నెల 29న బ్రో మూవీ టీజర్‌ విడుదల కావాల్సి ఉంది. కానీ టీజర్‌కు పవన్‌ డబ్బింగ్‌ బకాయి ఉంది. ఆ బకాయిని ఈ రోజు తీర్చుకున్నాడు. అయితే జ్వరం సాకుతో బస్సు యాత్రని ఆపి..డబ్బింగ్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)