Breaking News

బెడ్‌పై ఒకరు, మైండ్‌లో మరొకరు.. నిహారిక డైలాగ్‌పై ట్రోలింగ్‌

Published on Wed, 05/10/2023 - 20:17

చాలాకాలం గ్యాప్‌ తర్వాత మెగా డాటర్‌ నిహారిక కొణిదెల మళ్లీ యాక్టింగ్‌ వైపు దృష్టి మళ్లించింది. ప్రస్తుతం ఆమె డెడ్‌ పిక్సెల్స్‌ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ మే 19 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజవగా అందులో నిహారిక చెప్పిన డైలాగ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

గేమర్‌గా కనిపించిన నిహారిక ఆన్‌లైన్‌లో ఒకరిని ఇష్టపడుతుంది. ఆఫ్‌లైన్‌లో మరొకరిని ఇష్టపడుతుంది. ఇద్దరిలో ఎవరిని భాగస్వామిగా సెలక్ట్‌ చేసుకోవాలో అర్థం కాదు. ఆ సమయంలో 'నాకు బెడ్‌పై రోషన్‌ కావాలి.. కానీ మైండ్‌లో భార్గవ్‌ ఉన్నాడు (రోషన్‌ ఇన్‌ బెడ్‌.. భార్గవ్‌ ఇన్‌ ద హెడ్‌)' అని డైలాగ్‌ చెప్తుంది. ఇది చాలామందికి నచ్చలేదు. ఇలాంటి డైలాగులు అవసరమా? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావంటూ నిహారికను ఏకిపడేస్తున్నారు. మరి ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌ సమయంలో ఈ విమర్శలకు నిహారిక ఎలా చెక్‌ పెడుతుందో చూడాలి!

ఇకపోతే నిహారిక కొంతకాలంగా విడాకుల రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తోంది. నిహారిక, ఆమె భర్త చైతన్య ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతేకాక పెళ్లి ఫోటోలను సైతం డిలీట్‌ చేశారు. దీంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. కానీ ఇంతవరకు దీనిపై అటు నిహారిక, ఇటు చైతన్య స్పందించనేలేదు.

చదవండి: భార్యను దూరం పెట్టిన పూరీ జగన్నాథ్‌, ఎట్టకేలకు క్లారిటీ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)