Breaking News

వరుణ్‌, కియారాలపై నెటిజన్ల ఫైర్‌.. ‘వారిపై చర్యలు తీసుకోండి’

Published on Wed, 06/15/2022 - 13:58

బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌, హీరోయిన్‌ కియారా అద్వానీపై నెటిజన్లు మండిపడుతున్నారు. మెట్రో రైలులో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వీరి తీరుపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా వరుణ్‌-కియార జంటగా నటించిన తాజా చిత్రం 'జగ్‌ జగ్‌ జీయో'. రాజ్‌ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగ్గజ నటులు అనిల్‌ కపూర్‌, నీతూ కపూర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా మూవీ టీం ముంబై మెట్రో రైలులో సందడి చేశారు. ఈ నేపథ్యంలో వరుణ్‌, కియారా మెట్రో రైల్లో వడ పావ్‌ తింటూ కనిపించారు.

చదవండి: చాలా మందికి అప్పు ఇచ్చా.. తిరిగి ఇవ్వలేదు : గోపీచంద్‌

ఈ వీడియోను ప్రముఖ మీడియా పర్సన్‌ వైరల్‌ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక మెట్రోలో నిబంధనలకు విరుద్ధం ప్రవర్తించిన కియార, వరుణ్‌లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మెట్రోలో ఆహార పదార్థాలు అనుమతి లేదనే విషయం కూడా తెలియదా?’, ‘వీరిపై మెట్రో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. వీరితో పాటు సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్, మూవీ యూనిట్‌ కూడా ఉన్నారు. కాగా కియారలో తెలుగులో రామ్‌ చరణ్‌ ఆర్‌సీ 15 మూవీతో పాటు ఇటీవల కోలీవుడ్‌లో ఓ సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)