Breaking News

హనీమూన్ ట్రిప్‌లో రాహుల్ సిప్లిగంజ్‌.. నీకసలు సభ్యత సంస్కారం ఉందా?

Published on Tue, 01/06/2026 - 22:35

టాలీవుడ్ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. హరణ్య అనే అమ్మాయితో గతేడాది (నవంబర్‌ 27న) గ్రాండ్‌ వెడ్డింగ్‌ జరిగింది. ఈ వివాహ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం సినీ కెరీర్‌కు కొంచెం గ్యాప్ ఇచ్చిన రాహుల్.. మ్యారేజ్‌ తర్వాత ఫుల్‌గా చిల్ అవుతున్నారు. తన భార్యతో కలిసి హనీమూన్ ట్రిప్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే సింగర్ రాహుల్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలపై నెట్టింట రచ్చ మొదలైంది. కొంచెం డబ్బులు రాగానే బట్టలన్నీ విప్పేసి ఏదో సోషల్ మీడియాలో స్టేటస్ చూపించుకోవడమేంటని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి ప్రయత్నాలు కొంచెం తగ్గించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. ఈ రోజు మీకు ఇది ఫ్యాషన్ అవ్వొచ్చు కానీ.. రాబోయే రోజుల్లో మీ ఫోటోలు, వీడియోలతో ఇబ్బందులు పడతారని అంటున్నారు. మీకంటూ సభ్యత సంస్కారం ఉందా తమ్ముడు అంటూ రాహుల్‌పై నెటిజన్స్‌ ఫైరవుతున్నారు. మీ హనీమూన్ ఫోటోలు మేము చూసి ఎంజాయ్ చేయాలా అంటూ సోషల్ మీడియా వేదికగా సిప్లిగంజ్‌కు చురకలంటిస్తున్నారు. సోషల్ మీడియాను మంచి కోసం వాడండి.. ఇలాంటి పనులు కోసం కాదని రాహుల్‌కు సూచిస్తున్నారు.

రాహుల్‌ సిప్లిగంజ్ నేపథ్యం..

రాహుల్‌ (Rahul Sipligunj) జర్నీ విషయానికి వస్తే ఇతడు పక్కా హైదరాబాదీ కుర్రాడు. చిన్నప్పటినుంచే సంగీతం అంటే పిచ్చి. ఓపక్క తండ్రికి సాయంగా బార్బర్‌ షాప్‌లో పని చేస్తూనే మరోపక్క సంగీతంలో శిక్షణ తీసుకునేవాడు. సినిమాల్లో పాటలు పాడటంతో పాటు ప్రైవేట్‌ సాంగ్స్‌ చేశాడు. అవే అతడికి ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో కాలభైరవతో కలిసి పాడిన నాటునాటు సాంగ్‌ అతడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)