Breaking News

ట్రైలర్​ టాక్​: నాలుగు స్తంభాలాట

Published on Tue, 06/08/2021 - 14:41

ఓటీటీ కంటెంట్​లో అంథాలజీ(నాలుగైదు కథల సమూహారం) సిరీస్​లకు ఈమధ్య ఫుల్ క్రేజ్​ ఉంటోంది. ఈ తరుణంలో నెట్​ఫ్లిక్స్​ మరోక దానితో రాబోతోంది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే రాసిన కథల సమూహారం నుంచి నాలుగు కథలను తీసుకుని వాటి ఆధారంగా.. హిందీలో ‘రే’ సిరీస్​ను నిర్మించింది నెట్​ఫ్లిక్స్​. ఈ సిరీస్​ ట్రైలర్ ఇవాళే రిలీజ్​ అయ్యింది.

ఏదైనా గుర్తు పెట్టుకునే కంప్యూటర్ లాంటి​ బ్రెయిన్ ఉన్న ఒక వ్యక్తి, ఒక యువ నటుడు, ఒక ఫేమస్​ కవి, ఒక మేకప్​ ఆర్టిస్ట్.. ఈ నలుగురి జీవితాల కథాంశమే రే(కిరణం). కవిగా మనోజ్​ వాజ్​పాయి, సూపర్ మెమరీ ఉన్న వ్యక్తిగా మీర్జాపూర్​ ఫేమ్​ అలీ ఫజల్(గుడ్డూ), మేకప్​ ఆర్టిస్ట్​గా కయ్​ కయ్​ మీనన్​, నటుడి రోల్​లో హర్షవర్దన్​ కపూర్​లు యాక్ట్ చేశారు. సాఫీగా సాగిపోయే ఆ నలుగురి జీవితాల్లో కల్లోలం, వాళ్ల చీకటి గతం, ఆ నలుగురి కథలకు ఊహించని ముగింపుల హింట్​తో ట్రైలర్​ను ఆసక్తికరంగా కట్ చేశారు. అహం, అసూయ, వెన్నుపోటు, ప్రతీకారం.. చుట్టే ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది.


 
ఇక సత్యజిత్​ రే కథల సమూహారంలో ‘హంగామా హై క్యోన్​ బార్​పా, ఫర్​ గెట్​ మీ ఆనట్, బహురూపియా, స్పాట్​లైట్​ ప్రామిస్​’.. రే ఆంథాలజీ సిరీస్​గా రాబోతోంది. గజ్​రాజ్ రావ్​, శ్వేతా బసు ప్రసాద్​, అనిందితా బోస్​, బిదితా బాగ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  అభిషేక్​ చౌబే, శ్రీజిత్​ ముఖర్జీ, వాసన్​ బాల దీనిని తెరకెక్కించారు. జూన్​ 25న నెట్​ఫ్లిక్స్​లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. చదవండి:ఫ్యామిలీమ్యాన్​ 2 రివ్యూ

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)