జైలర్‌ మూవీ.. అలా చేయొద్దని హెచ్చరించారు: డైరెక్టర్‌

Published on Sat, 12/09/2023 - 13:55

ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన సినిమాల్లో జైలర్‌ ఒకటి. రజనీకాంత్‌ తన స్వాగ్‌తో సినిమాను రఫ్ఫాడించేశాడు. ఎమోషనల్‌ సీన్లలో జీవించేసి ఏడిపించేశాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు చిత్ర డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌. ఆయన మాట్లాడుతూ.. 'ఈ కథ రాసుకున్నప్పుడు, షూటింగ్‌ చేస్తున్నప్పుడు నాకు పెద్ద చాలెంజ్‌ ఎదురైంది. చాలామంది జైలర్‌ మూవీలో రజనీకాంత్‌ సర్‌ వెంటుక్రలను తెల్లగా చూపించొద్దని చెప్పారు.

అన్నింటికీ సిద్ధపడ్డా..
ఆయనతో ఏ ప్రయోగాలైనా చేయండి కానీ వయసు మీదపడ్డవారిలా తెల్ల జుట్టుతో మాత్రం చూపించొద్దని అడిగారు. ఇండస్ట్రీలో ఉన్నవారు కూడా ఇలాంటి మాటలే చెప్పేసరికి భయపడిపోయాను. పైగా ఆయన తన వయసుకు తగ్గ పాత్రలో నటించిన తొలి చిత్రం ఇదే! దీంతో నేనేం చేయాలా? అని చాలా తికమకపడ్డాను. ఏదైతే అదైందని ముందడుగు వేశాను. ఏదైనా విమర్శలు వస్తే స్వీకరించడానికి సిద్ధపడిపోయాను. కానీ పది రోజులు షూటింగ్‌ జరిగాక నాపై నాకు నమ్మకం వచ్చింది.

జైలర్‌లో స్టార్‌ హీరోలు..
రజనీని అలా చూపించడం వల్ల ఏమాత్రం నష్టం లేదని అర్థమైంది. సినిమా రిలీజయ్యాక ఎటువంటి స్పందన లభించిందో మీ అందరికీ తెలిసిందే' అని చెప్పుకొచ్చాడు నెల్సన్‌. కాగా జైలర్‌ సినిమాలో తమన్నా భాటియా, వసంత్‌ రవి, యోగి బాబు, రమ్య కృష్ణన్‌, వినాయకన్‌ కీలక పాత్రల్లో నటించారు. కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, బాలీవుడ్‌ స్టార్‌ జాకీ ష్రాఫ్‌, మలయాళం స్టార్‌ మోహన్‌ లాల్‌ అతిథి పాత్రల్లో మెప్పించారు.

చదవండి: రెండు నెలల తర్వాత సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)