Breaking News

గర్భంతో ఉన్న నటిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన దర్శకుడు!

Published on Thu, 03/09/2023 - 21:31

ప్రముఖ దర్శకుడు సతీశ్‌ కౌశిక్‌ మరణంతో బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. హోలీ వేడుకల్లోనూ సంతోషంగా పాల్గొన్న ఆయన బుధవారం గుండెపోటుతో మరణించారు. ఆయన మరణవార్తను అభిమానులు, సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో నటి నీనా గుప్తా సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించింది. 'బాధాకరమైన వార్తతో నిద్రలేచాను. ఈ ప్రపంచంలో నన్ను నాన్సీ అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయన ఒక్కరే! నేను తనను కౌశిఖాన్‌ అని పిలిచేదాన్ని. మా స్నేహం కాలేజీలో మొదలైంది, మేము తరచూ కలుసుకునేవాళ్లం. కానీ ఇప్పుడాయన లేరు. ఇది నన్నెంతో భయానికి గురి చేస్తోంది. అదే సమయంలో బాధిస్తోంది కూడా! తన భార్యాపిల్లలు శశి, వంశికలకు ఇదెంతో కష్టకాలం. వారికి ఏ అవసరం వచ్చి నేనెప్పుడూ అండగా ఉంటాను. ఆ భగవంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని రాసుకొచ్చింది.

కాగా గతంలో సతీశ్‌.. నీనాను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని నీనా తన ఆత్మకథ 'సచ్‌ కహో తో'లో రాసుకొచ్చింది. నీనా గర్భంతో ఉన్న సమయంలో సతీశ్‌ ఆమెకు ఎంతగానో అండగా నిలబడ్డారు. 'ఒకవేళ పుట్టబోయే పాప ఛామనచాయతో ఉంటే అది నా బిడ్డే అని చెప్పు. మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు నిన్నెవరూ అనుమానించరు' అని సతీశ్‌ చెప్పినట్లు పుస్తకంలో రాసుకొచ్చింది నీనా. ఇకపోతే సతీశ్‌ చివరగా ఎమర్జెన్సీ అనే చిత్రంలో కనిపించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)