Breaking News

నయనతార- ధనుష్‌ వీడియో క్లిప్‌ వివాదం.. హీరో తండ్రి షాకింగ్‌ కామెంట్స్‌!

Published on Mon, 11/18/2024 - 08:24

నయనతార సినీ, వ్యక్తిగత జీవితంపై రూపొందించిన నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ  టేల్‌’ డాక్యుమెంటరీ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. విజయ్‌ సేతుపతి, నయనతార జంటగా విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ధనుష్‌ నిర్మించిన తమిళ చిత్రం ‘నానుమ్‌ రౌడీదాన్‌’ (నేనూ రౌడీనే)లోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం తగదంటూ, ధనుష్‌ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్‌ నోటీసు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నయనతార సోషల్‌ మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు. 

తాజాగా ధనుష్‌ తండ్రి, దర్శక–నిర్మాత కస్తూరి రాజాను ‘ఈ విషయమై మీ అభిప్రాయం ఏంటి?’ అని ఒక విలేకరి ప్రశ్నించగా – ‘‘నయనతార వ్యవహారం గురించి నాకు కాస్త ఆలస్యంగా తెలిసింది. మేం ఎప్పుడూ ముందుకు పరిగెడుతుంటాం. తరుముకు వచ్చే వారి గురించి కానీ, వెనక మాట్లాడే వారి గురించి కానీ పట్టించుకునేంత టైమ్‌ మాకు లేదు. అయితే ధనుష్‌ అనుమతి కోసం రెండేళ్లు ఎదురు చూశానని నయనతార చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. మా దృష్టంతా మేం చేసే పని మీద ఉంటుంది. ధనుష్‌ ‘ఇడ్లీ కడై’ చిత్రంతో బిజీగా ఉన్నారు’’ అన్నారు.
– చెన్నై, ‘సాక్షి’ సినిమా ప్రతినిధి 

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి