మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
తొలిసారి ఆ సంప్రదాయానికి చెక్ పెట్టిన నయనతార..!
Published on Fri, 09/04/2026 - 14:59
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే టాక్సిక్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. యశ్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు గీతూ మోహన్గాస్ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంచితే మరో మూవీ హాయ్ కూడా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది.
అయితే నయనతార ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. తన సంప్రదాయానికి భిన్నంగా థియేటర్లో సందడి చేసింది. తన సుదీర్ఘ సినీ కెరీర్లోనే మొదటిసారిగా ఒక సినిమా రెస్పాన్స్‌ను స్వయంగా చూసేందుకు థియేటర్‌ను సందర్శించింది. ఆమెను చూసిన ఆడియన్స్ కేరింతలు కొడుతూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ సినిమాకి ఆమె ప్రొడ్యూసర్ కూడా కావడమే ఇలా ప్రమోషన్ కోసం బయటకు వచ్చిందని.. లేకపోతే ఎందుకు వస్తుందని కొందరు విమర్శిస్తున్నారు.
#Nayanthara theatre visit at kamala theatre chennai.#HiMovie pic.twitter.com/AmZUTC3tBE
— Quality Pixels (@Quality_Pixels) September 4, 2026
Tags : 1