Breaking News

నయనతారకు కోపమెక్కువ.. డైరెక్టర్‌తో వాదించేది!

Published on Fri, 04/26/2024 - 15:46

సినిమా పరిశ్రమ అంటే రంగులమయం అంటారు కానీ ఇదో మాయాజాలం కూడా! ఇక్కడ రాణించడానికి అందం, ప్రతిభ, అంతకు మించి అదృష్టం ఉండాలంటారు. నయనతార కెరీర్‌ ఆరంభంలో ఎన్నో అవమానాలు పడ్డారు. ఆమె ఈ స్థాయికి చేరుకుంటారని ఎవరూ ఊహించలేదు. కొందరు దర్శకులైతే నువ్వు నటిగా పనికి రావని ముఖం మీదే చెప్పిన సందర్భాలున్నాయి. ఎవరో ఎందుకు? నయనతారకు తమిళంలో తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు హరినే ఈమె ఆ స్థాయికి చేరుకుంటారని ఊహించలేదట.

ముక్కు మీద కోపం?
ఒక సందర్భంలో ఆయన నయనతార గురించి మాట్లాడుతూ.. తాను దర్శకత్వం వహించిన అయ్యా చిత్రంలో నయనతారను హీరోయిన్‌గా పరిచయం చేశానని, అందులో ఆమె 12వ తరగతి చదివే యువతిగా నటించారని చెప్పారు. ఈ చిత్రంలో నటించేటప్పుడు నయనతార చాలా కోపంగా ఉండేవారని, ఎందుకీ అమ్మాయి అంత కోపంగా ఉంటుందా? అని అనిపించేదన్నారు. దుస్తుల విషయంలో కూడా తనతో వాదించేవారని చెప్పారు. అయితే ఆ కోపంలో పని బాగా జరగాలనే భావం ఉండేదన్నారు.

ఈ స్థాయికి ఊహించలేదు
నయనతార మంచి నటిగా ఉన్నతస్థాయికి చేరుకుంటారని తెలుసుగానీ, మరీ ఈ స్థాయికి చేరుకుంటారని ఊహించలేదన్నారు. నిజమే.. కేరళలోని ఓ గ్రామంలో పుట్టిన డయానా కురియన్‌ అనే అమ్మాయి ఇప్పుడు నయనతారగా అవతారమెత్తి మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలను దాటి బాలీవుడ్‌లోనూ విజయ బావుటా ఎగరేస్తున్నారంటే సాధారణ విషయం కాదు. అలాగే చిత్ర నిర్మాతగానూ ఇతరత్రా పలు వ్యాపారాలతోనూ బిజీగా ఉన్నారీ లేడీ సూపర్‌స్టార్‌.

చదవండి: స్టార్‌ హీరో సినిమాలో శ్రీలీల ఐటమ్‌ సాంగ్‌?

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు