Breaking News

40 ప్లస్‌లో నయనతార క్రేజ్‌.. 'టాక్సిక్‌' మూవీకి భారీ రెమ్యునరేషన్‌

Published on Mon, 01/12/2026 - 07:23

తమిళసినిమా: కొందరికి వయసే తెలియదు 40ల్లోనూ 20ల్లాగానే కనిపిస్తారు. అలాంటి అతి తక్కువ మంది నటిమణుల్లో నయనతార ఒకరు. పాన్‌ ఇండియా కథానాయకిగా అవతరించిన మాలీవుడ్‌ బ్యూటీ ఈమె. అయితే నయనతార అదృష్టం మామూలుగా లేదు. కోలీవుడ్లో అడుగు పెట్టడంతోనే శరత్‌ కుమార్‌ వంటి స్టార్‌ హీరో సరసన నటించే అవకాశాన్ని పొందారు. ఆ చిత్ర విజయం ఈమెను కథానాయకిగా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా చేసింది. ఆ వెంటనే రజినీకాంత్‌ సరసన చంద్రముఖి, సూర్యతో కలిసి గజిని వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించే అవకాశాలు వరించాయి. 

మంచి చిత్రాలు నటించిన నయనతార టాలీవుడ్‌ ఆహ్వానించింది ఆ తర్వాత మలయాళం, కన్నడం భాషల్లో నటిస్తున్న నయనతార జవాన్‌ చిత్రంతో బాలీవుడ్‌ లోనూ రంగప్రవేశం చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. 41 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ లేడీ సూపర్‌ స్టార్‌ గా వెలుగొందుతూ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషలో నటిస్తూ బిజీగా ఉండడం విశేషం. ఈమె తెలుగులో చిరంజీవి సరసన నటించిన మన శంకర వరప్రసాద్‌ గారు చిత్రం సంక్రాంతి సందర్భంగా సోమవారం తెరపైకి వచ్చేసింది. కాగా కన్నడంలో యాష్‌ కథానాయకుడు నటించిన టాక్సిక్‌ చిత్రంలో నటిస్తున్నారు. 

మలయాళంలో పెట్రియడ్, డియర్‌ స్టూడెంట్‌ చిత్రాలు నటిస్తున్నారు. ఇక తమిళంలో ఈమె టైటిల్‌ పాత్రలో నటిస్తున్న  మన్నాంగట్టి సీన్స్‌ 1960, హాయ్, రాక్కాయి , మూక్కుత్తి అమ్మన్‌ 2 చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా తెలుగులో బాలకృష్ణకు జంటగా ఒక చిత్రంలో నటించటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలా నాలుగు భాషలు నటిస్తూ బిజీగా ఉన్న నయనతార పారితోíÙకం  విషయంలోనూ తగ్గేదెలే అంటున్నట్లు సమాచారం. ఈమె కన్నడంలో నడుస్తున్న టాక్సిక్‌ చిత్రం కోసం  రూ.18 కోట్లు డిమాండ్‌ చేసినట్లు, చివరికి రూ.15 కోట్లకు సమ్మతించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్‌ అవుతోంది.  

Videos

Vaibhav : 15వ బెర్త్ డే లోపు భారత్‌కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా ...?

సీబీఐ ఆఫీస్ లో హీరో విజయ్

ప్రతీ నెలా రూ.10 వేల పొదుపుతో కోటీశ్వరులయ్యారు.. సూపర్ హిట్ స్కీమ్ మీ కోసం

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో చోరీ

CP Sajjanar: చైనీస్ మాంజ చాలా ప్రమాధకరం

విజయ్ ను సీబీఐ అడగబోయే ప్రశ్నలివే..!

Devineni : YSRCP మీద ఏడవడం తప్ప.. జగన్‌ను చూసి బుద్ది తెచ్చుకో బాబు

మున్సిపల్ హీట్.. కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీ ఫుల్ ఫోకస్

Ambati : మా ఇద్దరికీ ఫైర్ బ్రాండ్ అని పేరు పెట్టింది అందుకే..

Karumuru Venkat: సనాతన డ్రామా ఆర్టిస్ట్.... పొద్దున్నేమో సనాతని.. రాత్రయితే..

Photos

+5

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)

+5

బుల్లితెర నటులు 'ఇంద్రనీల్, మేఘన'ల గృహప్రవేశం (ఫోటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)